Pawan Kalyan On Farmers : ఒక్కో కుటుంబానికి రూ.లక్ష – ఉగాది రోజున పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పంట నష్టాలతో ఆత్మహత్య చేసుకున్న రైతులు, కౌలు రైతుల కుటుంబాలకు అండగా..

Pawan Kalyan On Farmers : ఒక్కో కుటుంబానికి రూ.లక్ష – ఉగాది రోజున పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన

Pawan Kalyan On Farmers

Pawan Kalyan On Farmers : ఉగాది పర్వదినాన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన చేశారు. పంట నష్టాలతో ఆత్మహత్య చేసుకున్న రైతులు, కౌలు రైతుల కుటుంబాలకు అండగా నిలవాలని జనసేనాని పవన్ నిర్ణయించారు. ఇందులో భాగంగా ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు పార్టీ తరఫున రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం అందిస్తామన్నారు.

ఏపీలో పంట నష్టాలతో ఆత్మహత్య చేసుకున్న రైతులు, కౌలు రైతుల కుటుంబాలను ఆదుకుంటామని పవన్ ప్రకటించారు. ఒక్కో కుటుంబానికి రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం అందిస్తామన్నారు. వారి పిల్లల చదువులకు, ఇతర అవసరాలకు కొంతైనా అండ ఇవ్వాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు పవన్ ప్రకటించారు. అంతేకాదు త్వరలోనే ప్రతి కుటుంబాన్నీ తానే స్వయంగా పరామర్శిస్తానని చెప్పారు. కౌలు రైతులు సాగు చేసుకుంటే రుణం ఇవ్వరు, నష్టపోతే పరిహారం కూడా ఇవ్వరని ఆవేదన వ్యక్తం చేశారు పవన్ కళ్యాణ్.(Pawan Kalyan On Farmers)

Janasena: పెట్రోల్ పెంపు నిరసిస్తూ అన్ని జిల్లాల కలెక్టరేట్ల ముందు జనసేన నిరసన: పవన్ కళ్యాణ్ పిలుపు

”ఏపీలో పంట నష్టాలతో రైతులు, కౌలు రైతుల ఆత్మహత్యలు బాధాకరం. గోదావరి జిల్లాల్లోనే 73 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. సాగును నమ్ముకున్న వారి పరిస్థితి దయనీయంగా ఉంది. కొంతైనా ఊరట కోసం జనసేన పక్షాన ఆర్థిక సాయం అందిస్తాం. ఒక్కో కుటుంబానికి రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం చేస్తాం” అని తెలుపుతూ ఓ వీడియోని రిలీజ్ చేశారు పవన్ కళ్యాణ్.

”మేము చేసే సాయం రైతు కుటుంబాల్లోని పిల్లల చదువులకు కొంతైనా అండగా ఉంటుంది. ఆత్మహత్య చేసుకున్న ప్రతి రైతు కుటుంబాన్నీ త్వరలోనే పరామర్శిస్తా. ఆర్థిక సాయం అందించే ప్రక్రియ కూడా మొదలవుతుంది. కౌలు రైతుల బాధలు వింటుంటే హృదయం బరువెక్కుతుంది. కౌలు రైతుకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందట్లేదు. రైతులు, కౌలు రైతుల పక్షాన జనసేన పార్టీ నిలుస్తుంది’’ అని పవన్‌ కల్యాణ్‌ హామీ ఇచ్చారు.

”రైతులు రక్తం ధారపోస్తేనే ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణగా పేరుగాంచింది. అలాంటి అన్నదాతలకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన బహుమతి ఆత్మహత్యలే. ఆత్మహత్య చేసుకున్న రైతులకు ఆర్ధిక సాయం చేస్తామన్న వైసీపీ ప్రభుత్వం వారిని మోసం చేసింది. అందుకే ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు అండగా ఉండేందుకు తమవంతుగా ఒక్కో కుటుంబానికి రూ.లక్ష ఆర్ధిక సాయం అందిస్తామం. అప్పులు చేసి కష్టపడి పంట పండించిన కౌలు రైతులకు కనీసం గిట్టుబాటు ధర కూడా వచ్చే పరిస్థితి లేదు. గిట్టుబాటు ధరను అమలు చేయకపోవడంతో దళారులు, రైస్ మిల్లర్లు లాభపడుతున్నారు. ఆశించిన ధర రాక, ప్రభుత్వం ఆదుకోకపోవడంతో దిక్కుతోచని స్థితిలో రాష్ట్రంలో 3వేల మంది బలవన్మరణాలకు పాల్పడ్డారు” అని పవన్ తెలిపారు.

Pawan Kalyan : పవర్ కోసం పవన్ యుధ్ధం

ఉగాది పూట ఆ రైతుల కుటుంబాలు బాధతో ఉండకూడదనే.. వారికి కొంతైనా ఊరటనిచ్చేలా జనసేన తరపున ఆర్థిక సాయం అందిస్తున్నాం అని పవన్ అన్నారు. ఇప్పుడు అందరూ తినే తిండి గింజల్లో 80శాతం కౌలు రైతుల కాయకష్టం వల్ల పండినవే అని పవన్ అన్నారు. కౌలు రైతుల బాధల గురించి తెలిస్తే గుండె తరుక్కుపోతుందన్నారు. కౌలు రైతుకు నిబంధనల పేరుతో ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందకపోవడం బాధాకరం అన్నారు. వ్యవసాయం చేసుకుంటే రుణం ఇవ్వరు, పంట నష్టపోతే పరిహారమూ ఇవ్వరు. ఆత్మహత్య చేసుకున్నవారికీ ఆర్థిక సాయం అందడం లేదు అని పవన్ వాపోయారు. రైతులు, కౌలు రైతుల పక్షాన జనసేన పార్టీ నిలుస్తుందని ధైర్యం నింపారు పవన్ కళ్యాణ్.

తొలుత గోదావరి జిల్లాలు, ఆ తర్వాత రాయలసీమ జిల్లాల్లో పవన్ పర్యటిస్తారని తెలుస్తోంది. తొలుత గోదావరి జిల్లాల్లో 80 కుటుంబాలకు, ఆ తర్వాత కర్నూలు, అనంతపురం జిల్లాల్లో ఆత్మహత్య చేసుకున్న 150 మంది రైతుల కుటుంబాలకు ఆర్ధిక సాయం చేస్తామని పవన్ తెలిపారు. తానే స్వయంగా రైతు కుటుంబాలను కలిసి ఆర్ధిక సాయం అందిస్తామని ప్రకటించారు. ప్రతి రైతు కుటుంబానికి తాము అండగా ఉంటామని, ప్రభుత్వంపై పోరాటం చేస్తామని హామీ ఇచ్చారు జనసేనాని. వైసీపీ ప్రభుత్వం చట్టసవరణ చేసి కౌలు రైతులకు మేలు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు పవన్ కల్యాణ్. గత ఎన్నికల మేనిఫెస్టోలో రైతులకు ఆకర్షణీయ హామీలిచ్చిన పవన్.. ఇప్పుడు నేరుగా కౌలు రైతుల ఇళ్లకు వెళ్లి ఆర్ధికసాయం అందిస్తామని ప్రకటించడం ఏపీ రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.