Kurnool : కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో శిశువులు తారుమారు

కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రిలో శిశువుల తారుమారు వ్యవహారం కలకలం రేపింది.

Kurnool  : కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో శిశువులు తారుమారు

Kurnool Govt Hospital

Updated On : July 13, 2021 / 2:15 PM IST

Kurnool : కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రిలో శిశువుల తారుమారు వ్యవహారం కలకలం రేపింది. జిల్లాలోని దేవనకొండ మండలం నెల్లిబండకు చెందిన రజియా అనే మహిళ నిన్న రాత్రి మగబిడ్డకు జన్మనిచ్చింది. బిడ్డ ఆరోగ్యం బాగా లేకపోవడంతో రాత్రి శిశువును ఎన్.ఐ.సియూలో ఉంచి చికిత్స అందించటానికి తీసుకు వెళ్ళారు.

కొద్దిసేపటి తర్వాత వచ్చి బిడ్డ చనిపోయాడని ఆస్పత్రి సిబ్బంది చెప్పటంతో ఆమె బంధువులు ఆగ్రహం వెలిబుచ్చారు. పుట్టిన బిడ్డకు, ఆస్పత్రి సిబ్బంది ఇచ్చిన మృత శిశువు వేర్వేరుగా ఉన్నారని బిడ్డను సిబ్బంది తారుమారు చేశారని ఆరోపించారు. రజియా బంధువులు రాత్రి ఆస్పత్రిలో ఆందోళన చేపారు.