K A Paul meet Amit Shah: అమిత్ షాతో కేఏ పాల్ భేటీ: రాజకీయ వర్గాల్లో ఆసక్తి

ఇటీవల తెలంగాణలో తనపై జరిగిన దాడిలో సీఎం కేసీఆర్, కేటీఆర్ హస్తముందని ఆరోపించిన పాల్..ఆ దాడి తాలూకు పరిణామాలు త్వరలోనే వారు చూస్తారని అన్నారు

K A Paul meet Amit Shah: అమిత్ షాతో కేఏ పాల్ భేటీ: రాజకీయ వర్గాల్లో ఆసక్తి

Paul

K A Paul meet Amit Shah: ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకులు కేఏ పాల్, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అవడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి కలిగించింది. గురువారం రాత్రి ఢిల్లీలో కేంద్ర హోంమంత్రితో భేటీ అయిన పాల్, రెండు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న రాజకీయ విషయాల గురించి అమిత్ షా వద్ద ప్రస్తావించినట్లు తెలిసింది. అమిత్ షాతో భేటీ అనంతరం..మీడియాతో మాట్లాడిన కేఏ పాల్..అమిత్ షాతో పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించినట్లు తెలిపారు. ఇటీవల తెలంగాణలో తనపై జరిగిన దాడిలో సీఎం కేసీఆర్, కేటీఆర్ హస్తముందని ఆరోపించిన పాల్..ఆ దాడి తాలూకు పరిణామాలు త్వరలోనే వారు చూస్తారని అన్నారు. దాడి ఘటనను అమిత్ షా దృష్టికి తీసుకెళ్లానని, భాద్యులపై చర్యలు తీసుకుంటామని అమిత్ షా హామీ ఇచ్చినట్లు కేఏ పాల్ తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి అక్రమాలు తాను ఇదివరకెన్నడూ చూడలేదని..కేసీఆర్, కేటీఆర్ పాలనలో తెలంగాణలో రూ.లక్షల కోట్లు అవినీతి జరిగిందని కేఏ పాల్ ఆరోపించారు.

Also read:13th Century Fort: భూమిలోపల భారీ కోట: అరుణాచల్ ప్రదేశ్‌లో తవ్వకాల్లో బయటపడ్డ 13వ శతాబ్దపు కోట

రెండు తెలుగు రాష్ట్రల్లో సంక్షేమం పేరుతో జరుగుతున్న ఆర్ధిక కార్యకలాపాల ద్వారా రాష్ట్రాలు అప్పుల్లో కూరుకుపోతున్నాయని కేఏ పాల్ ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీలో అప్పు 8 లక్షల కోట్లుంటే.. తెలంగాణ అప్పు 4 లక్షల కోట్లు ఉందని..రాష్ట్రాలు ఇలాగే అప్పులు చేసుకుంటూ పోతే..దేశం మరో శ్రీలంకలాగా తయారవుతుందని అమిత్ షాతో అన్నట్టు పాల్ వివరించారు. ఈ భేటీ సందర్భంగా ప్రధాని మోదీని కలవాలని అమిత్ షా తనకు సూచించారని కేఏ పాల్ పేర్కొన్నారు. తెలంగాణ డీజీపీని కలిసేందుకు అపాయింట్మెంట్ ఇవ్వలేదన్న కేఏ పాల్..కేంద్ర హోంమంత్రి అడిగిన వెంటనే కలిసేందుకు రమ్మన్నారని చెప్పుకొచ్చారు. రానున్న ఎన్నికల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో తమ ప్రజాశాంతి పార్టీ అని స్థానాల్లో ఒంటరిగానే పోటీ చేయనుందని కేఏ పాల్ పేర్కొన్నారు.

Also Read:PM Modi: డబ్ల్యూహెచ్ఓలో సంస్కరణలు అవసరం: మోదీ