KA Paul: నేను ప్యాకేజ్ స్టార్‌ని కాదు.. అందుకే ఆ పని చేయలేదు: కేఏ పాల్

"నేను గెలిస్తే కేజీ నుంచి పీజీ ఉచిత విద్య, ఉచిత వైద్యం, ఉద్యోగాల భర్తీ, రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర, రూ.4,000 పెన్షన్ ఇస్తాను" అని పాల్ అన్నారు.

KA Paul: నేను ప్యాకేజ్ స్టార్‌ని కాదు.. అందుకే ఆ పని చేయలేదు: కేఏ పాల్

KA Paul

KA Paul-Pawan Kalyan: బీజేపీతో తాను పొత్తు పెట్టుకుంటే ఇప్పటికే తనకు మంత్రి పదవి వచ్చేదని, అయితే తాను ప్యాకేజ్ స్టార్‌ని కాదు కాబట్టే ఆ పార్టీతో పొత్తు పెట్టుకోలేదని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. ఇవాళ ఆయన హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు.

“బీసీలు, కాపులు పవన్ కల్యాణ్ ను ముఖ్యమంత్రి చేయాలని అనుకుంటుంటే జనసేనాని ఏంటీ.. మాటలు రాని చంద్రబాబు కొడుకును సీఎం చేస్తానని అంటున్నారు. నేను, జగన్ పొత్తు పెట్టుకుంటే కుప్పంలో చంద్రబాబు ఓడిపోతారు. నేను కెసీఆర్ పొత్తు పెట్టుకుంటే బీజేపీ, కాంగ్రెస్ వాళ్లు తెలంగాణలో గెలుస్తారా?

నేను బీజేపీతో పొత్తు పెట్టుకుంటే నాకు మంత్రి పదవి వచ్చేది. నేను ప్యాకేజ్ స్టార్‌ని కాదు.. కర్ణాటకలో మేము పోటీ చేస్తే కాంగ్రెస్, జేడీఎస్ ఓట్లు చీలి బీజేపీ గెలుస్తుందని మేము అక్కడ పోటీ చేయలేదు. అందుకే బీజేపీ ఓడిపోయింది. చంద్రబాబు హయాంలోనే వివేకానంద రెడ్డి హత్య జరిగింది. చంద్రబాబు ఎందుకు పోలీసు విచారణ చేయించలేదు.

సీబీఐ చంద్రబాబును ఎందుకు విచారించడం లేదు. చంద్రబాబు నాయుడు చేసిన అవినీతి మీద కూడా విచారణ జరిపించాలి. అవినీతి కాంగ్రెస్ పార్టీ మనకు అవసరమా? తెలంగాణలో కాంగ్రెస్ ఎక్కడైనా ఉందా? డబ్బులు ఇచ్చి రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్ష పదవి తెచ్చుకున్నాడు. సీనియర్ కాంగ్రెస్ నాయకులను కాదని ఓటు నోటుకు దొంగ రేవంత్ రెడ్డికి ఆ పదవి ఎలా ఇస్తారు?

ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ కు ఒక్క శాతం ఓట్లు అయిన ఉన్నాయా? మాకు 60 శాతం ఓట్లు ఉన్నాయి. ఆర్ఎష్ ప్రవీణ్ కుమార్, షర్మిల రండి.. నాతో కలిసి రండి మిమ్మల్ని ఎమ్మెల్యే, ఎంపీలు చేస్తాను. చంద్రబాబు, జగన్, కేసీఆర్ కు అవకాశం ఇస్తే లక్షల కోట్ల రూపాయల అప్పు అవుతుంది.

నేను గెలిస్తే కేజీ నుంచి పీజీ ఉచిత విద్య, ఉచిత వైద్యం, ఉద్యోగాల భర్తీ, రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర, రూ.4,000 పెన్షన్ ఇస్తాను. జూన్ లో మన పార్టీ కార్యక్రమాలు బాగా చేస్తాను. బిల్ క్లింటన్ ను నేను రప్పించాను. చంద్రబాబుకు బాలకృష్ణ దూరంగా ఉండాలి.

వివేకానంద మృతి కేసులో వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి నిర్దోషి కాదని నేను చెప్పానా? అంటూనిలదీశారు. హైదరాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ… చంద్రబాబు ఏజెంట్ లు తన మీద బురద చల్లుతున్నారని అన్నారు.” అని కేఏ పాల్ అన్నారు.

MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కాం సీబీఐ అనుబంధ ఛార్జిషీట్లో ఎమ్మెల్సీ కవిత పేరు లేదు