Kiran Kumar Reddy: అందుకే ఇన్నాళ్లు రాజకీయాలకు దూరంగా ఉన్నా: మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి

కాంగ్రెస్ లో మళ్లీ చేరినా ఆ పార్టీ తీరు తనకు నచ్చలేదని తెలిపారు.

Kiran Kumar Reddy: అందుకే ఇన్నాళ్లు రాజకీయాలకు దూరంగా ఉన్నా: మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి

Kiran Kumar Reddy

Kiran Kumar Reddy – BJP: రాష్ట్ర విభజన అనంతరం చోటు చేసుకున్న పరిణామాలతో అసంతృప్తి చెందే తాను ఇన్నాళ్లు రాజకీయాలకు దూరంగా ఉన్నానని మాజీ ముఖ్య మంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. విశాఖ(Vizag)లో ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడారు.

దారుణమైన రాజకీయాలను చూసి కొన్నైనా వాస్తవాలు చెప్పాలని మళ్లీ రాజకీయాల్లోకి వచ్చానని, బీజేపీలో చేరానని కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ లో మళ్లీ చేరినా ఆ పార్టీ తీరు తనకు నచ్చలేదని తెలిపారు. మొదట రాష్ట్ర విభజనలో బీజేపీ కూడా భాగస్వామ్యం కాబట్టి ఆ పార్టీని వద్దనుకున్నానని తెలిపారు.

తర్వాత కొన్నైనా వాస్తవాలు చెప్పాలని వచ్చానని అన్నారు. త్వరలో బీజేపీ దక్షిణాదిన కూడా బలపడుతుందని తెలిపారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్, మహిళా సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు, క్రాప్ లోన్స్ అద్భుతంగా పనిచేశాయని చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఎలా ఉందో ప్రజలే చెప్పాలని అన్నారు.

కాగా, తాను సీఎంగా ఉన్నప్పుడు రూ.7,500 కోట్లతో చిత్తూరు జిల్లా ప్రాజెక్టులకు రూపకల్పన చేశానని శనివారం కూడా కిరణ్ కుమార్ రెడ్డి చెప్పారు. ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక దానిని అడ్డుకున్నారని ఆరోపించారు.

JP Nadda: ఏపీ రాజధానికి మోదీ శంకుస్థాపన చేశారన్న నడ్డా.. సీఎంగా ఉన్నప్పుడు తానేం చేశారో చెప్పిన నల్లారి కిరణ్