Kodela Sivaram: కోడెల శివరాంను బుజ్జగిస్తున్న టీడీపీ నేతలు.. చంద్రబాబును కలిసిన కన్నా.. ఇంకా
టీడీపీ ప్రతినిధుల కార్లను కోడెల శివరాం అనుచరులు అడ్డుకున్నారు.

Kodela Sivaram Vs Kanna Lakshminarayana
Kodela Sivaram – TDP : ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు జిల్లా టీడీపీ నేత, దివంగత కోడెల శివప్రసాద్ కుమారుడు కోడెల శివరాంను ఆ పార్టీ నేతలు బుజ్జగిస్తున్నారు. కన్నా లక్ష్మీనారాయణ(Kanna Lakshminarayana)కు సత్తెనపల్లి టీడీపీ ఇన్‌ఛార్జ్ పదవి ఇవ్వడంపై కోడెల శివరాం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో సత్తెనపల్లిలో కోడెల కార్యాయాలనికి వచ్చిన టీడీపీ నేతల బృందం… శివరాంతో సమావేశమైంది.
టీడీపీ బృందంలో నక్కా అనంద బాబు, జీవీ ఆంజనేయులు, డోల బాలవీరాంజనేయస్వామి ఉన్నారు. కోడెల శివరాంతో సుదీర్ఘ మంతానాలు జరిపారు. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా పనిచేయాలని కోరారు. అదే సమయంలో అక్కడకు కోడెల అభిమానులు చేరుకున్నారు.
వాగ్వివాదం
సత్తెనపల్లిలో కోడెల కుటుంబానికి టీడీపీ ప్రతినిధులు స్పష్టమైన హామీ ఇవ్వలేదు. సమావేశం అనంతరం వెళ్తున్న టీడీపీ ప్రతినిధుల కార్లను కోడెల అనుచరులు అడ్డుకున్నారు. జిల్లా అధ్యక్షుడు జీవి ఆంజనేయులుతో కోడెల అనుచరులు వాగ్వివాదానికి దిగారు.
స్పష్టమైన హమీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అక్కడే రోడ్డు పై బైఠాయించి నిరసన తెలిపారు. కోడెల కుటుంబానికి న్యాయం చేస్తామని చంద్రబాబు అన్నారని నక్కా ఆనందబాబు మీడియాకు చెప్పారు.
చంద్రబాబుని కలిసిన కన్నా లక్ష్మీనారాయణ
టీడీపీ కార్యాలయంలో చంద్రబాబు నాయుడిని కశారు కన్నా లక్ష్మీనారాయణ. సత్తెనపల్లి ఇన్‌ఛార్జ్ గా తనను నియమించినందుకు చంద్రబాబుకి కృతజ్ఞతలు తెలిపారు. కన్నా లక్ష్మీనారాయణపై కోడెల శివరాం చేస్తోన్న వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారడంతో వీరి భేటీ మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.