Tirumala Ghat Road: తిరుమలలో విరిగిపడ్డ కొండచరియలు.. ఘాట్ రోడ్ క్లోజ్

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా కురుస్తున్న భారీ వర్షాలకు తమిళనాడులోని పలు జిల్లాలు, దక్షిణాంధ్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఫలితంగా తిరుమలలో కొండచరియలు విరిగిపడటం..

Tirumala Ghat Road: తిరుమలలో విరిగిపడ్డ కొండచరియలు.. ఘాట్ రోడ్ క్లోజ్

Tirumala

Tirumala Ghat Road: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా కురుస్తున్న భారీ వర్షాలకు తమిళనాడులోని పలు జిల్లాలు, దక్షిణాంధ్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఫలితంగా తిరుమలలో కొండచరియలు విరిగిపడటం ఆందోళన కలిగిస్తుంది. ఈ క్రమంలోనే తిరుమల నుంచి తిరుపతి వెళ్లే మార్గంలో కొండచరియలు విరిగిపడ్డాయి. మొదటి ఘాట్ రోడ్డులోని రెండో మలుపు వద్ద ఘటన జరిగింది.

ఫలితంగా ఘాట్ రోడ్ లో భారీ స్థాయిలో ట్రాఫిక్ స్తంభించిపోయింది. రాత్రి 8 గంటలకు టీటీడీ మొదటి, రెండో ఘాట్ రోడ్లను మూసివేయనున్నట్లు పర్యాటకులకు సూచించింది. తిరిగి శుక్రవారం ఉదయం 6గంటలకు తెరవనున్నారు.

…………………………………. : వైఎస్ షర్మిల 72 గంటల రైతు వేదన దీక్షకు అనుమతి నిరాకరణ