YS Sharmila Deeksha : వైఎస్ షర్మిల 72 గంటల రైతు వేదన దీక్షకు అనుమతి నిరాకరణ

వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల 72 గంటల రైతు వేదన దీక్షకు పోలీసులు అనుమతి నిరాకరించారు. రేపు ఇందిరాపార్క్ దగ్గర టీఆర్ఎస్‌ ఆందోళన కారణంగా అనుమతి ఇవ్వలేదు.

YS Sharmila Deeksha : వైఎస్ షర్మిల 72 గంటల రైతు వేదన దీక్షకు అనుమతి నిరాకరణ

Sharmila

Permission denied for YS Sharmila deeksha : వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల తలపెట్టిన 72 గంటల రైతు వేదన దీక్షకు పోలీసులు అనుమతి నిరాకరించారు. రేపు ఇందిరాపార్క్ దగ్గర టీఆర్ఎస్‌ ఆందోళన కారణంగా వైఎస్‌ షర్మిల దీక్షకు సెంట్రల్‌ జోన్‌ పోలీసులు అనుమతి ఇవ్వలేదు. దీంతో కామారెడ్డి నియోజకవర్గంలో వైఎస్‌ షర్మిల 72 గంటల దీక్ష చేపట్టనున్నారు.

మరోవైపు ధాన్యం సేకరించాలంటూ కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు టీఆర్ఎస్‌ ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతోంది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని టార్గెట్‌ చేస్తూ రేపు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ధర్నాలు చేపట్టనుంది. అందులో భాగంగా.. హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్‌ దగ్గర కూడా ధర్నా తలపెట్టారు.

Cyclone : మరికొన్ని గంటల్లో తీరాన్ని తాకనున్న వాయుగుండం..నెల్లూరు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు

దీని కోసం అనుమతి కోరుతూ ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ పోలీసులకు పర్మిషన్ అప్లై చేశారు. దానిని పరిశీలించిన సెంట్రల్‌ జోన్‌ పోలీసులు.. కొన్ని షరతులతో కూడిన అనుమతి మంజూరు చేశారు.