P Vijaya Babu : బండి సంజయ్ నీకంటే ఎక్కువ ఎగిరిపడ్డారు, ఇప్పుడు మూలన కూర్చున్నారు- పవన్ కల్యాణ్‌పై అధికార భాషా సంఘం అధ్యక్షుడు ఫైర్

ఒక వ్యక్తికి రెండు మూడు నివాసాలు ఉన్నా తప్పులేదు కానీ, రెండు మూడు సంసారాలుంటేనే బాగోదు అని విజయ్ బాబు వ్యాఖ్యానించారు. P Vijaya Babu

P Vijaya Babu : బండి సంజయ్ నీకంటే ఎక్కువ ఎగిరిపడ్డారు, ఇప్పుడు మూలన కూర్చున్నారు- పవన్ కల్యాణ్‌పై అధికార భాషా సంఘం అధ్యక్షుడు ఫైర్

P Vijaya Babu Warns Pawan Kalyan (Photo : Google)

Updated On : August 13, 2023 / 7:47 PM IST

P Vijaya Babu Warns Pawan Kalyan : ఏపీ రాజకీయం విశాఖలోని రుషికొండ చుట్టూ తిరుగుతోంది. రుషికొండపై నిర్మాణాలను పరిశీలించాక ఏపీ ప్రభుత్వం, సీఎం జగన్ ను ఉద్దేశించి జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన తీవ్ర వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. రాజకీయవర్గాల్లో దుమారం రేగింది. ఉత్తరాంధ్రను సీఎం జగన్ దోచేస్తున్నారు, వైసీపీ హయాంలో భూకబ్జాలు పెరిగిపోయాయి అంటూ పవన్ చేసిన ఆరోపణలపై రచ్చ రచ్చ జరుగుతోంది. వైసీపీ నాయకులు పవన్ కల్యాణ్ పై ఎదురుదాడికి దిగారు. పవన్ రాజకీయ అజ్ఞాని అని ఒకరంటే, నువ్వెవడు జగన్ గురించి మాట్లాడటానికి అని మరొకరు, చంద్రబాబు తొత్తు అని ఇంకొకరు విరుచుకుపడ్డారు.

తాజాగా అధికార భాషా సంఘం అధ్యక్షుడు పి.విజయ బాబు జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై తీవ్ర విమర్శలు చేశారు. పవన్ కల్యాణ్ ఒక రాజకీయ అజ్ఞాని అని అన్నారు. పవన్ ఆరోపిస్తున్నట్లుగా.. విశాఖపట్నంలో రుషికొండపై నిర్మాణాలను ఈ ప్రభుత్వంలో మొదలుపెట్టినవి కావని విజయ బాబు స్పష్టం చేశారు. చంద్రబాబు నాయుడు సీఎం ఉన్న సమయంలో రామానాయుడు స్టూడియో కోసం కొండకు గుండు కొట్టారని ఆయన గుర్తు చేశారు.

పవన్ కళ్యాణ్ పిచ్చి వాగుడుకు అలవాటు పడ్డారు అని మండిపడ్డారు. టీడీపీ వాళ్లే కబ్జాలు చేశారని అప్పటి మంత్రి అయ్యన్నపాత్రుడు కూడా చెప్పారని విజయ బాబు పేర్కొన్నారు. ఒక వ్యక్తికి రెండు మూడు నివాసాలు ఉన్నా తప్పులేదు కానీ, రెండు మూడు సంసారాలుంటేనే బాగోదు అని విజయ్ బాబు వ్యాఖ్యానించారు. పొట్టి శ్రీరాములు, గిడుగు రామ్మూర్తి పంతులు గురించి పవన్ కల్యాణ్ ఏదేదో మాట్లాడుతున్నారు.

Also Read..Galla Family: గల్లా కుటుంబం తరుఫున ఎవరు పోటీ చేసినా ఓకే.. టిక్కెట్ ఇచ్చేందుకు రెడీ!

నీ చొక్కాలు, జెండాలపై చేగువేరా అని వేసుకున్నప్పుడు తెలుగు వారెవరూ గుర్తుకు రాలేదా? అని పవన్ కల్యాణ్ ను ప్రశ్నించారు. పొట్టి శ్రీరాములు గురించి మాట్లాడే అర్హత పవన్ కు లేదన్నారు విజయ్ బాబు. చంద్రబాబు సీఎం అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని మార్చేశారని ఆయన మండిపడ్డారు. జగన్ మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని నవంబర్ 1న కొనసాగిస్తున్నారని చెప్పారు.

”పిచ్చి పవన్ కళ్యాణ్ ఒక్కటి గమనించు. నీకు పరోక్షంగా బీజేపీ మద్దతు ఉంటే ఉండొచ్చు. నీలాగే ఎగిరెగిరి పడినోళ్లు మూలన కూర్చున్నారు. తెలంగాణలో బండి సంజయ్ నీకంటే ఎక్కువ ఎగిరిపడ్డారు. ఇప్పుడు మూలన కూర్చున్నారు” రేపు నీ గతి అంతే అని అర్థం వచ్చేలా పవన్ కల్యాణ్ ను ఉద్దేశించి హెచ్చరించారు విజయ్ బాబు.

Also Read..Bonda Uma : వైసీపీ 175కి 175 సీట్లు గెలిస్తే మా పార్టీని మూసేస్తాం : బోండా ఉమ సంచలన వ్యాఖ్యలు