Online Cricket Betting : ఆన్ లైన్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న వ్యక్తి అరెస్టు

విశాఖలో ఇండియా, పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ ప్రభావంతో బెట్టింగ్ జోరుగా సాగుతోంది. మాధవధారలో ఉన్న ఓ అపార్ట్ మెంట్ లో నిర్వహిస్తున్న క్రికెట్ బెట్టింగ్ ను పోలీసులు గుట్టురట్టు చేశారు.

Online Cricket Betting : ఆన్ లైన్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న వ్యక్తి అరెస్టు

Cricket Betting

online cricket betting Man arrest : విశాఖలో ఇండియా, పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ ప్రభావంతో బెట్టింగ్ జోరుగా సాగుతోంది. మాధవధారలో ఉన్న ఓ అపార్ట్ మెంట్ లో నిర్వహిస్తున్న క్రికెట్ బెట్టింగ్ ను పోలీసులు గుట్టురట్టు చేశారు. ఆన్ లైన్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ప్రభాకర్ అనే వ్యక్తిని ఎయిర్ పోర్ట్ జోన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ప్రభాకర్ దగ్గర నుంచి ఒక ల్యాప్ టాప్, 2 మొబైల్ ఫోన్లు, రెండు చెక్ బుక్ లు, 2 ఏటీఎం కార్డులు, 88 వేల రూపాయల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆన్ లైన్ క్రికెట్ బెట్టింగ్ వెనుక నగరంలో మరి కొంతమంది ఉన్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు.

T20 World Cup 2021 : 31 రన్స్ కే ఇండియా 3వికెట్లు డౌన్

పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు ప్రభాకర్ ఇచ్చిన సమాచారం మేరకు ప్రత్యేక పోలీసు బృందాలు మిగిలిన బుకిలను పట్టుకునే పనిలో నిమగ్నమయ్యారు.