Alluri Sitaramaraju :  మన్నెం వీరుడు..అగ్గిపిడుగు అల్లూరి సీతారామరాజు

వీరత్వం, పౌరుషానికి ప్రాణం పోస్తే కనిపించే రూపం అల్లూరి సీతారామరాజు. బ్రిటిషర్ల గుండెల్లోకి దూసుకుపోయిన విప్లవ బాణం.. బ్రిటిష్ సామ్రాజ్యపు పునాదులు పెళ్లగించేందుకు పుట్టిన విప్లవ వీరుడు. భారత స్వాతంత్య్రం కోసం అసమాన పోరాటం చేసిన యోధుడు. మన్యం వీరుడు.. అగ్గి పిడుగు.. అల్లూరి సీతారామరాజు. మన్యం ప్రజల హక్కుల కోసం, యావత్ భారతావని స్వాతంత్య్రం కోసం పోరాడి.. 27 ఏళ్ల వయసులోనే ప్రాణ త్యాగం చేసిన విప్లవ జ్యోతి రామరాజు.

Alluri Sitaramaraju :  మన్నెం వీరుడు..అగ్గిపిడుగు అల్లూరి సీతారామరాజు

Alluri Sitaramaraju : వీరత్వం, పౌరుషానికి ప్రాణం పోస్తే కనిపించే రూపమే.. అల్లూరి సీతారామరాజు. బ్రిటిషర్ల గుండెల్లోకి దూసుకుపోయిన విప్లవ బాణం అతను. బ్రిటిష్ సామ్రాజ్యపు పునాదులు పెళ్లగించేందుకు పుట్టిన విప్లవ వీరుడు. భారత స్వాతంత్య్రం కోసం అసమాన పోరాటం చేసిన యోధుడు. మన్యం వీరుడు.. అగ్గి పిడుగు.. అల్లూరి సీతారామరాజు. మన్యం ప్రజల హక్కుల కోసం, యావత్ భారతావని స్వాతంత్య్రం కోసం పోరాడి.. 27 ఏళ్ల వయసులోనే ప్రాణ త్యాగం చేసిన విప్లవ జ్యోతి రామరాజు.

బ్రిటీష్ అధికారుల నిరంకుశ చర్యలకు వ్యతిరేకంగా విప్లవాగ్నిని రగిలించిన సీతారామరాజు.. 1922 ఆగస్టు 22న చింతపల్లి పోలీస్ స్టేషన్‌పై తొలిసారి దాడి చేశారు. ఆ తర్వాత 23న క్రిష్ణదేవీపేట పోలీస్ స్టేషన్, 24న తూర్పుగోదావరి జిల్లా రాజవొమ్మంగి పోలీస్ స్టేషన్‌పై దాడిచేశారు. ఈ మూడు స్టేషన్లపై దాడి ద్వారా భారీగా ఆయుధాలను సేకరించుకొని.. స్వాతంత్ర్య పోరాటం ప్రారంభించారు. ఇక అక్కడి నుంచి వరుసపెట్టి.. పోలీస్ స్టేషన్లపై దాడులు చేస్తూ బ్రిటిష్ అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించారు అల్లూరి. ఈ విప్లవాన్ని ఎలాగైనా అణచివేయాలని నిర్ణయించుకున్న బ్రిటిష్ ప్రభుత్వం.. మన్యంలో ముమ్మర చర్యలు చేపట్టి చాలా మంది అల్లూరి అనుచరులను పొట్టనబెట్టుకుంది.

రెండేళ్ల పాటు బ్రిటిషర్లకు కంటిమీద కనుకు లేకుండా చేసిన అల్లూరి.. బ్రిటిష్ ప్రభుత్వం మన్యం ప్రజలను పెడుతున్న కష్టాలను చూడలేక ప్రాణత్యాగానికి సిద్ధపడ్డారు. 1924 మే 7న విశాఖ జిల్లా మంప గ్రామానికి సమీపాన.. అల్లూరి స్వయంగా లొంగిపోయారు. సీతారామరాజుపై పగతో రగిలిపోయిన బ్రిటిష్ అధికారులు.. ఆయన్ని చింతచెట్టుకు కట్టి కాల్చిచంపారు. సీతారామరాజు కలలుగన్న స్వాతంత్య్రం.. ఆయన ఆత్మత్యాగం చేసిన 28 ఏళ్లకు.. భారత ప్రజలకు లభించింది. స్వంతంత్ర భారతావని జయకేతనంగా అల్లూరి సీతారామరాజు చరిత్రలో నిలిచిపోయారు.

సీతారామరాజు అంటే వ్యక్తి కాదు సమూహ శక్తి. సంగ్రామ భేరి. స్వాతంత్ర్య నినాదం.. సమరగీతం.. ఉద్యమ జ్వాల.1917లో విశాఖ జిల్లా క్రిష్ణదేవీపేట ద్వారా మన్యంలోకి అడుగుపెట్టారు. అక్కడ.. అడవి బిడ్డల దీన స్థితులు, అవస్థలు పరిశీలించి,తనను నమ్ముకున్న ప్రజల కోసం ప్రాణత్యాగానికి కూడా వెనుకాడలేదు సీతారామరాజు.1897 జులై 4న విశాఖ జిల్లా పాండ్రంగిలో జన్మించిన సీతారామరాజు.. పెరిగింది మాత్రం పశ్చిమ గోదావరి జిల్లా మోగల్లులో. 9వ తరగతి వరకు చదివిన అల్లూరి.. సంస్కృతం, జోతిష్యం, విలువిద్య, గుర్రపు స్వారీలో ప్రావీణ్యం పొందారు.

రామరాజు తండ్రి వెంకట రామరాజు, తల్లి సూర్యనారాయణమ్మ. సీతారామరాజు ప్రధాన అనుచరుడు, సేనాని గాం గంటందొర. ఈయనది నడింపాలెం గ్రామం. గంటందొర, మిగిలిన అనుచరుల సాయంతో బ్రిటిష్ అధికారులపై విప్లవానికి అల్లూరి తెరతీశారు. మే 8న రాజు అనుచరులు ఆయన భౌతికకాయాన్ని క్రిష్ణదేవీపేటకు తీసుకువచ్చి తాండవనది పక్కన దహన క్రియలు జరిపారు. అగ్గి పిడుగు. మన్నెం విప్లవ వీరుడు. తెలుగు జాతి పౌరుషాన్ని ప్రపంచానికి చాటిన వీర కిశోరం మన అల్లూరి సీతారామ రాజు. భారత స్వాతంత్ర ఉద్యమాన్ని విప్లవ పథం వైపు నడిపిన యోధుడు. భరత మాత దాస్య శృంఖలాలను తెంచడానికి సాగిన సమరంలో ప్రాణ త్యాగం చేసిన అసమాన శూరుడు. మన్యం ప్రజల మాన ప్రాణ రక్షణకు తెల్ల దొరలను ఎదిరించిన యువ కిశోరం సీతారామరాజు. ఆ మహావీరుడు సాగించిన సంగ్రామం గిరిజన జాతికే కాదు భారత దేశానికి ఆదర్శప్రాయం.

కాగా..అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాలు జూలై 4న భీమవరంలో ఘనంగా నిర్వహించనున్నారు. ఈకార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ విచ్చేస్తున్నారు.  ముఖ్యమంత్రి  జగన్‌,గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డితోపాటు పలువురు ప్రముఖులు హాజరు కానున్నారు. భీమవరంలో సభా ప్రాంగణం ఏర్పా ట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఇప్పటికే స్పెషల్‌ ఎస్పీజీ, ఏఐజీ హిమాన్షుగుప్త, కేంద్ర కల్చరల్‌ డైరెక్టర్‌ అతుల్‌మిశ్రాలు ప్రాంగణాన్ని పరిశీలించి భద్రతా పరమైన ఏర్పాట్లపై స్థానిక అధికారులతో చర్చించారు.