Botsa Satya Narayana : సామాన్యుడికి అందుబాటులో ఉండాలనే.. హీరో నాని వ్యాఖ్యలకు మంత్రి కౌంటర్

ఇష్టం వచ్చినట్టు సినిమా టికెట్ల రేట్లు పెంచుకుంటామంటే కుదరదని తేల్చి చెప్పారు. మేమింతే... మా ఇష్టం వచ్చిన రేట్లకు టికెట్లు అమ్ముకుంటాం అంటే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు.

Botsa Satya Narayana : సామాన్యుడికి అందుబాటులో ఉండాలనే.. హీరో నాని వ్యాఖ్యలకు మంత్రి కౌంటర్

Botsa Satya Narayana

Botsa Satya Narayana : ఏపీలో సినిమా టికెట్ల వ్యవహారం ముదురుతోంది. సినిమా టికెట్ల రేట్లు తగ్గిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై టాలీవుడ్ నుంచి పలువురు బాహాటంగానే విమర్శలు చేస్తున్నారు. ముఖ్యంగా హీరో నాని చేసిన వ్యాఖ్యలతో వాతావరణం మరింత వేడెక్కింది. నాని వ్యాఖ్యలకు మంత్రులు ఘాటుగా బదులిస్తున్నారు.

నాని వ్యాఖ్యలపై మంత్రి బొత్స సత్యనారాయణ కాస్త ఘాటుగానే స్పందించారు. ఇష్టం వచ్చినట్టు సినిమా టికెట్ల రేట్లు పెంచుకుంటామంటే కుదరదని తేల్చి చెప్పారు. మేమింతే… మా ఇష్టం వచ్చిన రేట్లకు టికెట్లు అమ్ముకుంటాం అంటే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. ఏవైనా సమస్యలు ఉంటే జిల్లాల స్థాయిలో అధికారులకు నివేదించాలని, ప్రభుత్వం పరిశీలిస్తుందని బొత్స తెలిపారు. మీకు నచ్చిన రేట్లకు సినిమా టికెట్లు అమ్ముకునేందుకు అనుతిస్తే ఒత్తిళ్లు లేనట్టా…! ధరలు నియంత్రిస్తే ఒత్తిళ్లు ఉన్నట్టా…! అని నిలదీశారు.

January 1 Alert : జనవరి 1 నుంచి RBI కొత్త రూల్స్‌.. ఆన్‌లైన్ పేమెంట్లపై ఈ నిబంధనలు తప్పనిసరి..

సామాన్యుడికి అందుబాటులో ఉండాలనే సినిమా టికెట్ల ధరలు తగ్గించామని, ఇందులో ప్రేక్షకులను అవమానించడం ఏముంది? అని ప్రశ్నించారు. మార్కెట్లో వస్తువులకు ప్రతిదానికి ఎమ్మార్పీ అనేది ఉంటుందని, ఆ పరిమితికి మించి అమ్మకూడదు కదా అని హితవు పలికారు.

”టికెట్ ధరలను నియంత్రిస్తే అవమానించడమా? సామాన్యుడికి సినిమా అందుబాటులో ఉండాలనే ధరలు తగ్గించాము. మార్కెట్ లో ఉన్న ప్రతి వస్తువుకు ఎమ్మార్పీ ఉంటుంది. ధరలు ఇష్టమొచ్చినట్లుగా పెంచడం ధర్మమా? ఏదైనా ఇబ్బంది ఉంటే అధికారులను సంప్రదించాలి. ప్రభుత్వం ఆలోచిస్తుంది” అని మంత్రి బొత్స అన్నారు.

Best Smart Phones in India 2021 : డిసెంబర్ 2021లో రూ.25వేల లోపు బెస్ట్ మొబైల్ ఫోన్లు ఇవే..!

సినిమా కంటే కిరాణ షాపు నయం…
కాగా, సినిమా టికెట్ ధరలను ఏపీ ప్రభుత్వం తగ్గించడంపై సినీ హీరో నాని బహిరంగంగానే అసహనాన్ని వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్ణయంపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ‘శ్యామ్ సింగరాయ్’ చిత్రబృందం మీడియా సమావేశంలో నాని మాట్లాడారు. ”సినిమా టికెట్ల ధరలను ఏపీ ప్రభుత్వం తగ్గించింది. ఇది సరైన నిర్ణయం కాదు.

టికెట్ ధరలను తగ్గించడం ద్వారా ప్రేక్షకులను ప్రభుత్వం అవమానించింది. ప్రస్తుత పరిస్థితుల్లో సినిమా థియేటర్ కంటే.. పక్కనే ఉండే కిరాణా షాపు అత్యధిక ఆదాయం సంపాదిస్తోంది. ఏపీలో సినిమా టికెట్ల కలెక్షన్ల కంటే కిరాణా షాపు కలెక్షన్లే బాగున్నాయి. టికెట్ ధరలు పెంచినా కొనగలిగే సామర్థ్యం ప్రేక్షకులకు ఉంది. అయినా, ఇప్పుడు నేను ఏది మాట్లాడినా వివాదాస్పదమే అవుతుంది” అని నాని అన్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని ఉద్దేశించి నాని చేసిన ఈ వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

Exercise : వ్యాయామ సమయంలో గుండెపోటులకు కారణం?

నానిని అభినందించిన టీడీపీ నాయకురాలు..
సినిమా టికెట్ల ధరలను తగ్గిస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరికాదని హీరో నాని చేసిన వ్యాఖ్యలను టీడీపీ స్వాగతించింది. జగన్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై సినీ హీరో నాని మాట్లాడటం మంచి పరిణామమని, అభినందించదగ్గ విషయమని టీడీపీ నాయకురాలు వంగలపూడి అనిత అన్నారు.

”నాని మాదిరి టాలీవుడ్ కు చెందిన పెద్ద హీరోలు మాట్లాడాలి. పెద్ద హీరోలు విజయవాడకు వచ్చి సీఎం జగన్ ను, మంత్రి పేర్ని నానిని కలిసి వెళ్లడం కాదు. పరిశ్రమకు జరుగుతున్న అన్యాయంపై ధైర్యంగా మాట్లాడాలి” అని అనిత సూచించారు.

తన సొంత రంగమైన సినీ పరిశ్రమకు ప్రభుత్వం చేస్తున్న అన్యాయంపై హీరో నాని మాట్లాడారని అనిత ప్రశంసించారు. ప్రభుత్వ తప్పును నాని ఎత్తి చూపారు కాబట్టి… ఇప్పుడు ఆయన ఇంట్లోని మహిళలను వైసీపీ మంత్రులు టార్గెట్ చేస్తారేమోనని అనుమానం వ్యక్తం చేశారు. కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజునే తిట్టిన ఏపీ మంత్రులకు నాని కుటుంబ సభ్యులను తిట్టడం పెద్ద విషయం కాదన్నారు. ప్రతి రంగాన్ని జగన్ ఇబ్బందుల పాలు చేస్తున్నారని అనిత మండిపడ్డారు.