Karumuri On Early Elections : ఏపీలో ముందస్తు ఎన్నికలు..? క్లారిటీ ఇచ్చిన మంత్రి

ఏపీలో ముందస్తు ఎన్నికల అంశంపై హాట్ హాట్ గా డిస్కషన్ నడుస్తోంది. రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ముందస్తు ఎన్నికలు వస్తాయనే చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా నడుస్తోంది.

Karumuri On Early Elections : ఏపీలో ముందస్తు ఎన్నికలు..? క్లారిటీ ఇచ్చిన మంత్రి

Karumuri On Early Elections

Karumuri On Early Elections : ఏపీలో ముందస్తు ఎన్నికల అంశంపై హాట్ హాట్ గా డిస్కషన్ నడుస్తోంది. రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ముందస్తు ఎన్నికలు వస్తాయనే చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా నడుస్తోంది. ఎవరికి వారు తమ తమ వాదనలు వినిపిస్తున్నారు. ఒక్కో పార్టీ ఒక్కో విధంగా రియాక్ట్ అవుతోంది.

తాజాగా ముందస్తు ఎన్నికలపై ఏపీ పౌరసరఫరాల మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో ముందస్తు ఎన్నికలు ఉండవు అని ఆయన తేల్చి చెప్పారు. రాష్ట్రంలో బలమైన ప్రభుత్వం ఉందని మంత్రి అన్నారు. ఎన్నికలు లేకుండానే పొత్తులు పొత్తులు అని మాట్లాడుతున్నారని విపక్షాలపై మండిపడ్డారు. ప్రతిపక్షాలు ప్రజల వద్దకు వెళ్లే పరిస్థితి లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ మూడు సీట్లకు పరిమితం అవుతుందని మంత్రి జోస్యం చెప్పారు.(Karumuri On Early Elections)

YCP sajjala : చంద్రబాబు, పవన్ కళ్యాణ్ బంధం కొనసాగుతూనే ఉంటుంది-సజ్జల

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మంత్రి కారుమూరి ఫైర్ అయ్యారు. చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసేందుకు పవన్ బట్టలు చించుకుంటున్నారని విమర్శించారు. జగన్ ను ఎదుర్కోవడానికి అన్ని పార్టీలు పొత్తులు అంటున్నాయని అన్నారు. కానీ, వైసీపీ మాత్రం ఎవరితోనూ పొత్తులు పెట్టుకోదని మంత్రి తేల్చి చెప్పారు.

Chandrababu : పొత్తులపై చంద్రబాబు కొత్త మాట

సింహం సింగిల్ గానే వస్తుందన్న మంత్రి కారుమూరి.. మళ్లీ జగన్ సీఎం అవుతారని విశ్వాసం వ్యక్తం చేశారు. ఢిల్లీని ఎదుర్కొన్న వ్యక్తి జగన్ అని ప్రశంసించారు. చంద్రబాబే సోనియా, బీజేపీ, పవన్ కాళ్లు పట్టుకుంటారని అన్నారు. అధికారం కోసం చంద్రబాబు ఎంతకైనా దిగజారుతారని, ఎవరి కాళ్లు అయినా పట్టుకుంటారని విమర్శించారు.

ఇది ఇలా ఉంటే.. ఇప్పుడు ఏపీ రాజకీయాలు పొత్తుల చుట్టూ తిరుగుతున్నాయి. వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ పొత్తులపై జనసేనాని పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.

Pawan Kalyan Slams Government : వైసీపీ మళ్లీ వస్తే అంధకారమే-పవన్ కళ్యాణ్

వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఓటమే లక్ష్యంగా పవన్ ముందుకు సాగుతున్నారు. ఛాన్స్ చిక్కిత చాలు జగన్ ప్రభుత్వంపై ఫైర్ అవుతున్నారు. ఎట్టిపరిస్థితుల్లో మరోసారి వైసీపీ అధికారంలోకి రావడానికి వీల్లేదని పవన్ అంటున్నారు. ఏపీలో వైసీపీ పాలన అస్తవ్యస్తంగా ఉందని, రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలంటే ప్రత్యామ్నాయ పాలన అవసరం అని స్పష్టం చేశారు.

అయితే, రాష్ట్రాన్ని రక్షించాలంటే వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదని, వైసీపీ వ్యతిరేక ఓటు చీలితే రాష్ట్రం అంధకారంలోకి వెళుతుందని అన్నారు. పొత్తులపైనా పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు. పొత్తు అనేది ప్రజలకు ఉపయోగపడేలా ఉండాలన్నారు. పొత్తులను వ్యక్తిగత లాభాల కోణంలో చూడడం లేదని స్పష్టం చేశారు. 2014లో బీజేపీ, టీడీపీలతో కలిసి జనసేన పోటీ చేసిందని వెల్లడించారు. ఎప్పుడైనా సరే, పొత్తు ప్రజలకు ఉపయోగపడకపోతే జనసేన అందులోంచి బయటికి వస్తుందని తెలిపారు.

ఇక, సమయం వచ్చినప్పుడు పొత్తులపై మాట్లాడతానని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చెప్పారు. వైసీపీపై ప్రజల్లో తిరుగుబాటు మొదలైందన్నారు. అవసరమైతే త్యాగాలు చేయడానికి కూడా సిద్ధమని చంద్రబాబు అనడం హాట్ టాపిక్ గా మారింది.

బీజేపీ వెర్షన్ మరోలా ఉంది. ఎవరి త్యాగాలూ తమకు అవసరం లేదంటూ చంద్రబాబుకు సోము వీర్రాజు షాకిచ్చారు. కుటుంబ, అవినీతి పార్టీల కోసం బీజేపీ త్యాగం చేయాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు.