TTD: “భక్తులు పరిమితికి మించి రావడంతోనే ఇలా జరిగింది”

భక్తుల రద్దీ తగ్గించడానికే స్లాట్ విధానాన్ని ప్రవేశపెట్టామని ఒకేసారి పరిమితికి మించి రావడంతోనే సమస్య తలెత్తిందంటున్నారు దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ. తిరుమలలో భక్తులకు అందుత

TTD: “భక్తులు పరిమితికి మించి రావడంతోనే ఇలా జరిగింది”

Kottu Satyanarayana

TTD: భక్తుల రద్దీ తగ్గించడానికే స్లాట్ విధానాన్ని ప్రవేశపెట్టామని ఒకేసారి పరిమితికి మించి రావడంతోనే సమస్య తలెత్తిందంటున్నారు దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ. తిరుమలలో భక్తులకు అందుతున్న సౌకర్యాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు.

క్యూలైన్లలో మొన్న జరిగిన తొక్కిసలాటలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. భక్తులు క్యూలైన్లలో 20, 30 గంటలు వేచి ఉండాల్సిన అవసరం ఉండకూడదనే టీటీడీ స్లాట్ విధానాన్ని ప్రవేశపెట్టిందని అన్నారు.

“ఒక్కసారిగా భక్తుల రద్దీ పెరగడంతోనే క్యూలైన్లలో తొక్కిసలాట జరిగింది. టిటిడి అప్రమత్తంగా ఉండటంతో వెంటనే దాన్ని అదుపు చేయగలిగింది. భక్తుల సౌకర్యాల కల్పనకు వెనుకడుగు వేయకుండా చర్యలు తీసుకుంటున్నాం. దర్శనాలు పూర్తిస్థాయిలో ప్రారంభించిన సందర్భంలో పరిమితికి మించి భక్తులు రావడంతోనే ఘటన నమోదైంది” దీనిని కూడా రాజకీయం చేస్తే ఎలా. ఇందులో టీటీడీ నిర్లక్ష్యం ఏమాత్రం లేదని మంత్రి వివరించారు.

 

Read Also: తిరుపతిలో అనూహ్య రద్దీ.. అల్లాడిన భక్తులు, టీటీడీ ఘోర వైఫల్యం..10tv సాయం