Tirupathi: తిరుపతిలో అనూహ్య రద్దీ.. అల్లాడిన భక్తులు, టీటీడీ ఘోర వైఫల్యం..10tv సాయం

సోమవారం భక్తులు అనూహ్యంగా తరలివచ్చారు. అలిపిరి, రెండో సత్రం వద్ద టోకెన్లు తీసుకోవడానికి రెండు, మూడు రోజుల నుంచి వేచి ఉన్నారు...కొంతమంది కిందపడిపోయారు. సృహ తప్పి పడిపోయారు...

Tirupathi: తిరుపతిలో అనూహ్య రద్దీ.. అల్లాడిన భక్తులు, టీటీడీ ఘోర వైఫల్యం..10tv సాయం

Ttd Tickets

Tirupathi: తిరుపతిలో ఇసుక వేస్తే రాలనంతగా భక్తులు పోటెత్తారు. ఎప్పుడూ చూడనంతగా శ్రీవారి భక్తులు రావడంతో.. విపరీతమైన రద్దీ నెలకొంది. అనూహ్యంగా రద్దీ పెరిగిపోయింది. చంటిబిడ్డలతో వచ్చిన తల్లిదండ్రులు, వృద్ధులు అయితే అల్లాడి పోయారు. బతుకు జీవుడా..అంటూ వెనక్కి వచ్చేస్తున్నారు. చాలా మంది నీళ్లు.. నీళ్లు తల్లడిల్లిపోయారు. సమాచారం తెలుసుకున్న 10tv అక్కడకు చేరుకుంది. భక్తులు పడుతున్న ఇబ్బందులు, సమస్యలను బాహ్య ప్రపంచానికి తెలియచేసింది. క్యూ లైన్ లో ఇరుక్కున్న వారిని కాపాడేందుకు ప్రయత్నించింది. టీటీడీ ఘోర వైఫల్యం చెందిందని, తాము మూడు రోజుల నుంచి ఇక్కడే ఉంటున్నామని భక్తులు వాపోయారు. తిండి, నీళ్లు లేక ఉంటున్నామని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read More : Tirumala : టీటీడీ సంచలన నిర్ణయం-శ్రీవారి సర్వ దర్శనానికి టోకెన్లు అక్కర్లేదు

కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామిని తనివితీర చూడాలని చాలా మంది భక్తులు అనుకుంటుంటారు. కరోనా కాలంగా శ్రీవారిని దర్శించుకోలేదు. ప్రస్తుతం పరిస్థితుల్లో మార్పు రావడంతో నిబంధనలు సవరించింది టీటీడీ. దీంతో కొన్ని రోజులుగా భారీగా భక్తులు తరలివస్తున్నారు. వీకెండ్ రోజుల్లో విపరీతమైన రద్దీ నెలకొంది. అయితే.. 2022, ఏప్రిల్ 12వ తేదీ సోమవారం భక్తులు అనూహ్యంగా తరలివచ్చారు. తిరుపతిలోని అలిపిరి, రెండో సత్రం వద్ద టోకెన్లు తీసుకోవడానికి రెండు, మూడు రోజుల నుంచి వేచి ఉన్నారు. శ్రీవారిని దర్శించుకోవడానికి రద్దీ పెరగడంతో వీరిని కట్టడి చేసేందుకు బారికేడ్లు ఏర్పాటు చేసింది. ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది.

Read More : TTD : తిరుపతిలో తొక్కిసలాట.. ఎండలకు అల్లాడుతున్న భక్తులు, టీటీడీ వైఫల్యమేనా ?

కొంతమంది కిందపడిపోయారు. సృహ తప్పి పడిపోయారు. క్యూ లైన్ లో సరైన మేనేజ్ మెంట్ లేకపోవడం స్పష్టంగా కనిపిస్తోంది. మేల్కొన్న టీటీడీ సంచలన నిర్ణయం తీసుకుంది. టోకెన్లు అవసరం లేదని, నేరుగా శ్రీవారి దర్శనం చేసుకోవచ్చని ప్రకటించింది. కానీ తెలుగులోనే..ప్రకటిచండంతో ఈ బాష రాని వారికి తెలియకపోవడంతో చాలా మంది ఇబ్బందులు పడ్డారు. చివరకు 10tv రిపోర్టర్ స్వయంగా మైక్ తీసుకుని తమిళం, ఇంగ్లీషు, హిందీ, తెలుగులో అనౌన్స్ మెంట్ చేశారు. చాలా మంది భక్తులకు తెలియచేశారు. అక్కడున్న భక్తులు శ్రీవారి దర్శనానికి వెళుతున్నారు. ఇదే నిర్ణయం తీసుకుంటే బాగుండేదని భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు. కొండపైకి వెళ్లేందుకు బస్సులను ఏర్పాటు చేసింది టీటీడీ.