TTD : తిరుపతిలో తొక్కిసలాట.. ఎండలకు అల్లాడుతున్న భక్తులు, టీటీడీ వైఫల్యమేనా ?

ఏర్పాటు చేసిన ఇనుప కంచెను తోసుకుని లోనికి వెళ్లేందుకు భక్తులు ప్రయత్నించారు. దీంతో అక్కడ తొక్కిసలాట జరిగింది. భక్తులు ఒకరిపై ఒకరు కిందపడిపోయారు...

TTD : తిరుపతిలో తొక్కిసలాట.. ఎండలకు అల్లాడుతున్న భక్తులు, టీటీడీ వైఫల్యమేనా ?

Ttd

Stampede In Tirupati : తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. టోకెన్ల పంపిణీ చేసే రెండవ సత్రం, అలిపిరి వద్దకు ఇసుకవేస్తే రాలనంతగా భక్తులు వచ్చారు. అక్కడ ఏర్పాటు చేసిన ఇనుప కంచెను తోసుకుని లోనికి వెళ్లేందుకు భక్తులు ప్రయత్నించారు. దీంతో అక్కడ తొక్కిసలాట జరిగింది. భక్తులు ఒకరిపై ఒకరు కిందపడిపోయారు. దీంతో ముగ్గురు భక్తులకు గాయాలయ్యాయి. టీటీడీ వైఫల్యం కారణంగానే ఈ ఘటన జరిగిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. భక్తుల రద్దీని సరిగ్గా అంచనా వేయలేకపోతోందంటున్నారు. మండుటెండల్లో వస్తున్న భక్తుల కోసం ఎలాంటి ఏర్పాట్లు చేయలేదంటున్నారు. చంటిబిడ్డలతో వచ్చిన భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు సమాచారం.

Read More : Janasena : అనంతకు జనసేనాని.. ఆత్మహత్య చేసుకున్న ఒక్కో రైతు కుటుంబానికి రూ. లక్ష

కరోనా కారణంగా ఇన్ని రోజులు తిరుమలకు వెళ్లలేకపోయిన వారు.. శ్రీవారిని దర్శించుకోవడానికి వస్తున్నారు. ప్రధానంగా వీకెండ్ లో ఇసుక వేస్తే రాలనంతగా భక్తులు తరలివస్తున్నారు. దీంతో ఆ ప్రాంతమంతా భక్తులతో సందడిగా మారుతోది. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శించుకోవడానికి భక్త జనం వస్తున్నారు. ప్రధానంగా శ్రీవారి దర్శనం కోసం టికెట్లు తీసుకొనేందుకు క్యూ లైన్ లో వేచి ఉన్నారు. కరోనా కారణంగా గతంలో బోసిపోయిన ప్రాంతాలు ఇప్పుడు భక్తుల గోవింద నినాదాలతో తిరుమల మారుమ్రోగుతోంది. టోకెన్ల కౌంటర్ వద్ద, అలిపిరి వద్ద భారీగా రద్దీ ఏర్పడింది. వందల సంఖ్యలో వాహనాలు కొండపైకి వెళ్లేందుకు వేచి చూస్తున్నాయి. కానీ భక్తులు ఇంతలా వస్తారని అంచనా వేయలేకపోవడం, సరైన ఏర్పాట్లు చేయలేదని భక్తులు మండిపడుతున్నారు.