Pensions Removal : పెన్షన్ల కోత.. మంత్రి పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు

పెన్షన్ల కోత అంటూ టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. అర్హులైన వారికి ఎట్టి పరిస్థితుల్లో పెన్షన్లు తొలగించబోము అని మంత్రి తేల్చి చెప్పారు. విద్యుత్ శాఖ అధికారుల పొరపాటు వల్ల 300 యూనిట్లు దాటిన కొందరికి నోటీసులు వెళ్లాయని, వాటిని సరి చేస్తామన్నారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.(Pensions Removal)

Pensions Removal : పెన్షన్ల కోత.. మంత్రి పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు

Pensions Removal : పెన్షన్ల కోత అంటూ టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. అర్హులైన వారికి ఎట్టి పరిస్థితుల్లో పెన్షన్లు తొలగించబోము అని మంత్రి తేల్చి చెప్పారు. విద్యుత్ శాఖ అధికారుల పొరపాటు వల్ల 300 యూనిట్లు దాటిన కొందరికి నోటీసులు వెళ్లాయని, వాటిని సరి చేస్తామన్నారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.

”మొదటి నుంచి ప్రభుత్వంపై టీడీపీ దుష్ప్రచారం చేస్తోంది. ఈ ప్రచారాన్ని తిప్పికొట్టాలి. మీకు అన్యాయం జరిగుంటే దాన్ని సరి చేస్తాం. ప్రభుత్వం అన్యాయంగా ఎవరి పెన్షన్లు తొలగించదు. ఈరోజు కొంతమందికి నోటీసులు ఇచ్చారు. మీకు అర్హత లేదని. ఆ నోటీసులకు కూడా సరైన సంజాయిషీ ఇస్తే పెన్షన్లు తిరిగి ఇవ్వడం జరుగుతుంది” అని మంత్రి పెద్దిరెడ్డి అన్నారు.(Pensions Removal)

Also Read..Pawan Kalyan On Jagan Government : ప్రభుత్వం మారకపోతే ఆంధ్రలో అంధకారమే-పవన్ కల్యాణ్ సంచలనం

పెన్షన్ల కోత వ్యవహారం ఏపీ రాజకీయాల్లో దుమారం రేపింది. సామాజిక పెన్షన్లలో పెద్ద ఎత్తున కోత పెట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోందన్న వార్తలు కలకలం సృష్టించాయి. పెన్షన్ దారుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. 2023 జనవరి నుండి కొత్త వారికి కూడా పెన్షన్లు ఇస్తామని చెబుతున్న ప్రభుత్వం, అదే సమయంలో ప్రస్తుతం ఇస్తున్న వారికి కోత పెట్టడం విమర్శలకు తావిచ్చింది. పెన్షన్ పొందడానికి మీరు అనర్హులు అంటూ ప్రభుత్వం నోటీసులు ఇవ్వడం ప్రారంభించింది. పలు కారణాలు చూపి పెన్షన్లు తొలగిస్తోంది.

పెన్షన్ల తొల‌గింపుపై వ్యవహారంపై సీఎం జ‌గ‌న్ స్పందించారు. పింఛ‌న్ల తొల‌గింపు ప్ర‌చారంపై కీల‌క కామెంట్స్ చేశారు. రాష్ట్రంలో ఏ ఒక్క‌రి పెన్ష‌న్‌ను తొల‌గించ‌డం లేద‌ని సీఎం జ‌గ‌న్ స్ప‌ష్టం చేశారు. కేవ‌లం రీ వెరిఫికేష‌న్ మాత్ర‌మే చేప‌ట్టిన‌ట్టు ఆయ‌న వెల్ల‌డించారు. అర్హులైన వారికి ఎలాంటి ఇబ్బంది ఉండ‌ద‌ని హామీ ఇచ్చారు. పెన్షన్లపై ప్రతి 6 నెలలకు ఒకసారి ఆడిట్‌ జరగాల‌ని, ఇందులో భాగంగా ఆడిట్‌ జరుగుతుంటే పెన్షన్లు తీసేస్తున్నారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని సీఎం జగన్ ప్రతిపక్షాలపై మండిప‌డ్డారు.

Also Read..CM Jagan Cabinet : వద్ధాప్య పెన్షన్‌ను రూ.2,750కి పెంచిన జగన్ ప్రభుత్వం.. గతంలో ఎంత? ఇప్పటి ప్రభుత్వం ఇచ్చేది ఎంత? వివరాలు

ల‌బ్ధిదారుల‌కు నోటీసులిచ్చి రీ-వెరిఫికేషన్‌ మాత్రమే చేస్తారన్నారు. మంచి పనులను చెడుగా చూపించేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని ఆయ‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. తప్పుడు ప్రచారాన్ని కలెక్టర్లు తిప్పికొట్టాలని జ‌గ‌న్ సూచించారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

కాగా.. 6 నెల‌ల‌కు ఒక‌సారి ఆడిట్ జ‌ర‌గ‌డం మంచిదేనని, అయితే.. అర్హుల‌ను ఎంపిక చేసేట‌ప్పుడే జాగ్ర‌త్త‌లు తీసుకుని ఉంటే, ఇవాళ రీ వెరిఫికేష‌న్‌కు అవ‌స‌రం ఉండేది కాదు క‌దా? అనే ప్ర‌శ్న‌లు తలెత్తుతున్నాయి.