Vizianagaram : రామతీర్థం కోదండరామాలయం నిర్మాణ పనులు త్వరలో ప్రారంభం : వెల్లంపల్లి

విజయనగరం జిల్లా రామతీర్థంలోని బోడికొండపై శ్రీకోదండ రామాలయాన్ని పునర్నిర్మించి వచ్చే ఏడాది జనవరి నాటికి ప్రారంభించనున్నారు.

Vizianagaram : రామతీర్థం కోదండరామాలయం నిర్మాణ పనులు త్వరలో ప్రారంభం : వెల్లంపల్లి

Updated On : June 10, 2021 / 5:47 PM IST

Vizianagaram : విజయనగరం జిల్లా రామతీర్థంలోని బోడికొండపై శ్రీకోదండ రామాలయాన్ని పునర్నిర్మించి వచ్చే ఏడాది జనవరి నాటికి ప్రారంభించనున్నారు. రామతీర్థంలోని బోడికొండపై కోదండరామాలయ నిర్మాణానికి రూ.3కోట్లును దేవాదాయశాఖ కేటాయించింది. టెండర్లు ప్రక్రియ పూర్తయింది. ఆగమశాస్త్రం ప్రకారం పండితులు, స్వామీజీల సూచనల మేరకే ఆలయాన్ని నిర్మించనున్నారు.

చిలకలూరిపేట నుంచి పనివారిని రప్పించి పూర్తి రాతి కట్టడంగా ఆలయాన్ని తీర్చిదుద్దనున్నారు. కొండపై ఆలయ నిర్మాణానికి అవసరమైన వసతులు సమకూర్చి అనుకున్న సమయానికి ఆలయాన్ని పూర్తి చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు వెల్లడించారు. దేవాలయాల పరిరక్షణే ధ్యేయంగా సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చర్యలు చేపడుతున్నారని చెప్పారు. రామతీర్ధం ఆలయ నమూనాలను మంత్రి విడుదల చేశారు.