Ministers Committee : హెచ్‌ఆర్‌ఏ స్లాబులపై మంత్రుల కమిటీ కొత్త ప్రతిపాదనలు

సచివాలయ, హెచ్ఓడీ కార్యాలయ ఉద్యోగులకు రూ.23 వేల సీలింగ్ తో 24శాతం హెచ్ఆర్ఏ, ఐఆర్ రికవరీ చేయబోమని మంత్రుల కమిటీ స్పష్టం చేసింది. ఐదేళ్లకు ఒకసారి పీఆర్సీ అమలు చేసేందుకు సుముఖంగా ఉంది.

Ministers Committee : హెచ్‌ఆర్‌ఏ స్లాబులపై మంత్రుల కమిటీ కొత్త ప్రతిపాదనలు

Committee

new proposals on HRA slabs : ఉద్యోగ సంఘాలతో మంత్రుల కమిటీ భేటి కొనసాగుతోంది. హెచ్‌ఆర్‌ఏ స్లాబులపై మంత్రుల కమిటీ కొత్త ప్రతిపాదనలు చేసింది. 50 వేల లోపు జనాభా ప్రాంతాల్లో రూ.10 వేల సీలింగ్‌తో 8 శాతం హెచ్‌ఆర్‌ఏ, 2 లక్షల లోపు జనాభా ప్రాంతాల్లో రూ.10 వేల సీలింగ్‌తో 9.5 శాతం హెచ్‌ఆర్‌ఏ, 5 లక్షల లోపు జనాభా ప్రాంతాల్లో రూ.12 వేల సీలింగ్తో 13.5 శాతం హెచ్‌ఆర్‌ఏ, 10 లక్షల లోపు జనాభా ప్రాంతాల్లో రూ.15 వేల సీలింగ్‌తో రూ.16 శాతం హెచ్‌ఆర్‌ఏ వంటి కొత్త ప్రతిపాదనలు ఉంచింది.

సచివాలయ, హెచ్ఓడీ కార్యాలయ ఉద్యోగులకు రూ.23 వేల సీలింగ్ తో 24 శాతం హెచ్ఆర్ఏ, ఐఆర్ రికవరీ చేయబోమని మంత్రుల కమిటీ స్పష్టం చేసింది. ఐదేళ్లకు ఒకసారి పీఆర్సీ అమలు చేసేందుకు మంత్రుల కమిటీ సుముఖత వ్యక్తం చేసింది. ఫిట్ మెంట్ 23 శాతమే ఇస్తామని తేల్చి చెప్పింది. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ప్రొబేషన్ తర్వాత కొత్త పీఆర్సీ వేతనం ఇవ్వనున్నారు.

Strike Banned : ఏపీ మైనింగ్ శాఖలో సమ్మెను నిషేధిస్తూ ఉత్తర్వులు

మంత్రుల కమిటీ, స్టీరింగ్ కమిటీ సభ్యులు ఇవాళ భేటీ అయ్యారు. ఆర్థికపరమైన అంశాలపై ఇవాళ క్లారిటీ ఇస్తామని మంత్రుల కమిటీ చెబుతోంది. హెచ్ఆర్ఏ, సీపీఏ, ఐఆర్, రికవరీ, పెన్షనర్ల క్వాంటమ్ పెన్షన్లు ప్రధానంగా డిమాండ్లుగా స్టీరింగ్ కమిటీ సభ్యులు మంత్రుల కమిటీ ముందు ఉంచారు. సాయంత్రం సీఎం జగన్ తో స్టీరింగ్ కమిటీ భేటీ అయ్యే ఛాన్స్ ఉంది.

ఉద్యోగ సంఘాల నాయకులతో శుక్రవారం సాయంత్రం 7 గంటల నుంచి అర్ధరాత్రి ఒంటి గంట వరకు మంత్రుల కమిటీ సుదీర్ఘంగా చర్చలు జరిపింది. HRA శ్లాబ్‌లలో మార్పులు, పింఛనుదారులకు అదనపు క్వాంటం పింఛను లాంటి అంశాలపై కొన్ని ప్రతిపాదనల్ని ఉద్యోగ సంఘాల నేతల ముందు ఉంచినట్టు తెలిసింది. చర్చలు సానుకూల వాతావరణంలో జరిగాయని, ఇవాళ ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. మరోవైపు పీఆర్సీ విషయంలో చాలా అంశాలపై ఇంకా స్పష్టత రాకపోవడంతో తాము ముందే ప్రకటించినట్టుగా ఉద్యమ కార్యాచరణ కొనసాగుతుందని ఉద్యోగ సంఘాల నేతలు స్పష్టం చేశారు.

PM Modi : ముచ్చింతల్ చేరుకున్న ప్రధాని మోదీ

ఛలో విజయవాడకు వేల సంఖ్యలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు తరలిరావడం, నిరసన విజయవంతం కావడంతో తదుపరి కార్యాచరణకు ఉద్యోగసంఘాలు నడుంకట్టాయి. ప్రస్తుత చర్చల్లో చాలా వరకు సానుకూలత తీసుకువచ్చామని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. శనివారం ఉద్యోగులు చేపట్టనున్న సహాయ నిరాకరణ విరమించుకోమని కోరామన్నారు. అయితే చర్చలు కొలిక్కి వచ్చే వరకు ఉద్యమ కార్యాచరణ కొనసాగుతుందని ఉద్యోగ సంఘాలు స్పష్టం చేశాయి.