Kidnap : 15 ఏళ్ల బాలుడ్ని కిడ్నాప్ చేసిన వివాహిత

కృష్ణా జిల్లా గుడివాడలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. 28 ఏళ్ల వివాహిత మహిళ 15 ఏళ్ల బాలుడిని కిడ్నాప్ చేసి తీసుకువెళ్లింది. బాలుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయగా.. దర్యాప్తులో పలు అంశాలు వెలుగులోకి వచ్చాయి.

Kidnap : 15 ఏళ్ల బాలుడ్ని కిడ్నాప్ చేసిన వివాహిత

Kidnap : కృష్ణా జిల్లా గుడివాడలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. 28 ఏళ్ల వివాహిత మహిళ 15 ఏళ్ల బాలుడిని కిడ్నాప్ చేసి తీసుకువెళ్లింది. బాలుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయగా.. దర్యాప్తులో పలు అంశాలు వెలుగులోకి వచ్చాయి.

గుడివాడలోని  గుడ్ మెన్ పేటకు చెందిన 15 ఏళ్ల బాలుడు ఈనెల 19 వ తేదీన ఆదృశ్యమయ్యాడు. దీంతో బాలుడి తండ్రి సుందర రాజు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎదురింట్లో ఉండే మహిళ అపహరించిందని ఫిర్యాదులో   పేర్కోన్నాడు.  పోలీసులు కిడ్నాప్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. మహిళ డబ్బుకోసం కిడ్నాప్ చేసిందా మరేమైనా కారణాలు ఉన్నాయా అని పోలీసులు విచారణ చేపట్టగా పలు కీలక విషయాలు వెలుగు చూశాయి.

ఎదురింట్లో ఉండే బాలుడితో, పెళ్లై ఇద్దరు పిల్లలు ఉన్న వివాహిత మహిళ సన్నిహిత సంబంధం ఏర్పరుచుకున్నట్లు గుర్తించారు. ఇద్దరూ ఒకే రోజు అదృశ్యం కావటం పలు అనుమానాలకు తావిస్తోంది. బాలుడిని మాయమాటలతో తీసుకెళ్లినట్లు గుర్తించామని టూటౌన్ సీఐ దుర్గారావు తెలిపారు. వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Also Read : YS Jagan Mohan Reddy : కోనసీమ జిల్లాలో రేపు వైఎస్ జగన్ పర్యటన