YS Jagan Mohan Reddy : కోనసీమ జిల్లాలో రేపు వైఎస్ జగన్ పర్యటన

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం జులై 26వ తేదీన కోనసీమ జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తారు. గోదావరి వరదల వల్ల దెబ్బతిన్న ప్రాంతాల్లో పర్యటించి, బాధితులతో నేరుగా మాట్లాడతారు.

YS Jagan Mohan Reddy : కోనసీమ జిల్లాలో రేపు వైఎస్ జగన్ పర్యటన

Ys Jagan Mohan Reddy

YS Jagan Mohan Reddy : ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం జులై 26వ తేదీన కోనసీమ జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తారు. గోదావరి వరదల వల్ల దెబ్బతిన్న ప్రాంతాల్లో పర్యటించి, బాధితులతో నేరుగా మాట్లాడతారు.

ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరిన సీఎం, 10.30 గంటలకు పి.గన్నవరం మండలం జి.పెదపూడి గ్రామానికి చేరుకుంటారు. అక్కడి నుంచి 11 గంటలకు  పుచ్చకాయలవారిపేటలో వరద బాధితులతో సమావేశమవుతారు.

ఆ తర్వాత  అరిగెలవారిపేట చేరుకుని అక్కడ బాధితులను కలుస్తారు. అక్కడి నుంచి ఉడిమూడిలంక చేరుకుని అక్కడ వరద బాధితులతో సమావేశమవుతారు.

అక్కడి నుంచి బయలుదేరి మధ్యాహ్నం 2.05 గంటలకు పి.గన్నవరం మండలం వాడ్రేవుపల్లి చేరుకుని అక్కడి నుంచి రాజోలు మండలం మేకలపాలెం చేరుకుంటారు.  అక్కడ వరద బాధితులతో సమావేశం అయిన అనంతరం సాయంత్రం 4.05 గంటలకు రాజమండ్రి చేరుకుంటారు.

అక్కడి ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌లో తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లో వరద ప్రభావం అనంతరం తీసుకున్న సహాయక చర్యలపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. రాత్రికి అక్కడే బస చేస్తారు.

Also Read : CBI : రాజ్యసభ సీటు, గవర్నర్ పదవి రూ.100 కోట్లు.. నలుగురిని అరెస్ట్ చేసిన సీబీఐ