MLA Roja: వైసీపీ కోవర్టులపై చర్యలు తీసుకోండి: ఎమ్మెల్యే రోజా

చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే రోజా శుక్రవారం జిల్లా ఎస్పీ సెంథిల్ కుమార్ ను కలిశారు. వైసీపీ కోవర్టులు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారంటూ ఈసందర్భంగా రోజా ఎస్పీ దృష్టికి తీసుకువచ్చారు

MLA Roja: వైసీపీ కోవర్టులపై చర్యలు తీసుకోండి: ఎమ్మెల్యే రోజా

Roja

Chittoor Politics: చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే రోజా శుక్రవారం జిల్లా ఎస్పీ సెంథిల్ కుమార్ ను కలిశారు. వైసీపీ కోవర్టులు కొందరు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారంటూ ఈసందర్భంగా రోజా ఎస్పీ దృష్టికి తీసుకువచ్చారు. అటువంటి వారిపై చర్యలు తీసుకోవాలని ఎస్పీకి ఫిర్యాదు చేసారు. వైసీపీ పేరు చెప్పుకొంటూ కొందరు వ్యక్తులు అధికారులను సైతం బెదిరిస్తున్నారని.. మంత్రి పెద్దిరెడ్డి రామ చంద్రారెడ్డి, రాష్ట్ర డిజిపి ఫోటోలనూ ఫ్లెక్సీల్లో వేసుకుంటూ అక్రమాలకు పాల్పడుతున్నారని రోజా పేర్కొన్నారు. అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలంటూ జిల్లా ఎస్పీకి ఆమె ఫిర్యాదు చేసారు.

Also Read: Sudheer : మాస్ హీరోగా మారుతున్న సుధీర్.. యాక్షన్‌తో అదరగొట్టిన ‘గాలోడు’

అనంతరం మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యే రోజా..వైసీపీలో ఉంటూ టీడీపీతో జతకలిసి వారిని ఉపేక్షించబోమని హెచ్చరించారు. గతంలో పార్టీ నుంచి సస్పెండ్ అయిన వారు ఇప్పుడు వైసీపీ, మంత్రి రామచంద్రారెడ్డి పేరు చెప్పుకుంటూ తిరుగుతున్నారని రోజా మండిపడ్డారు. ఈ విషయాన్నీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దృష్టికి కూడా తీసుకువెళ్లానని రోజా పేర్కొన్నారు. వైసీపీలో కోవర్టులుగా వ్యవహరిస్తున్న వారితో పార్టీకి చెడ్డపేరు వస్తుందని..అటువంటి వారిపై, పార్టీ అధిష్టానం చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రోజా డిమాండ్ చేసారు. ఇదిలా ఉంటే.. గత కొన్ని రోజులుగా నగరి నియోజకవర్గ పరిధిలో వైసీపీ రెండు వర్గాలుగా చిలిందంటూ వార్తలు వస్తున్నాయి. డిసెంబర్ 21న సీఎం జగన్ పుట్టినరోజు వేడుకలను సైతం వర్గాలుగా విడిపోయి జరిపించారు. దీంతో నగరిలో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి.

Also Read: మహారాష్ట్రపై విరుచుకుపడుతున్న ఒమిక్రాన్