TTD Oriental College : నా మాట వింటే పాస్ చేస్తా.. టీటీడీ కాలేజీలో కామాంధుడు.. ఆడియో లీక్

విద్యార్థినులతో అసభ్యంగా మాట్లాడటమే కాక, ఆ మాటలను ఫోన్ లో రికార్డు చేసే వాడు సురేంద్ర. వాటిని మళ్లీ వారికే పంపి బ్లాక్ మెయిల్ చేసేవాడు. తాను చెప్పినట్లు వింటే పరీక్షల్లో పాస్ చేస్త

TTD Oriental College : నా మాట వింటే పాస్ చేస్తా.. టీటీడీ కాలేజీలో కామాంధుడు.. ఆడియో లీక్

Ttd Oriental College

TTD Oriental College : రెండు రోజుల క్రితం సస్పెండ్ అయిన టీటీడీ ఓరియంటల్ కాలేజీ ప్రిన్సిపాల్ సురేంద్ర ఆగడాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. విద్యార్థినులతో అసభ్యంగా మాట్లాడటమే కాక, ఆ మాటలను ఫోన్ లో రికార్డు చేసే వాడు సురేంద్ర. వాటిని మళ్లీ వారికే పంపి బ్లాక్ మెయిల్ చేసేవాడు. తాను చెప్పినట్లు వింటే పరీక్షల్లో పాస్ చేస్తానని, పరీక్షలు సరిగా రాయకపోయినా 70 మార్కులు వేస్తానని అమ్మాయిలను లోబర్చుకునే ప్రయత్నం చేశాడు.

ఈ విషయం బయటకు రావడంతో కళాశాల ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. సురేంద్రను సప్పెండ్ చేశారు. కాగా, సురేంద్ర ఇలా సస్పెండ్ కావడం ఇది తొలిసారి కాదు. గతంలోనూ ఇలాంటి ప్రవర్తనతోనే సురేంద్ర సస్పెండ్ కు గురయ్యాడు. కామాంధుడు సురేంద్ర ఆగడాలు టీటీడీ ఓరియంటల్ కాలేజీ పరువు తీసేలా ఉన్నాయని పలువురు వాపోయారు.

Visakhapatnam Constable : అదృశ్యమైన క్రైమ్ కానిస్టేబుల్ మృతదేహం లభ్యం

తిరుపతి ఎస్వీ ఓరియంటల్ కళాశాలలో లైంగిక వేధింపులు కలకలం రేపాయి. ప్రిన్సిపాల్ సురేంద్ర, వార్డెన్ రామనాథంను కఠినంగా శిక్షించాలని విద్యార్థి, మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న కళాశాలలో లైంగిక వేధింపుల ఆరోపణలు రావడం సంచలనమైంది. దీనిపై స్పందించిన అధికారులు.. ప్రిన్సిపాల్, వార్డెన్‌ను సస్పెండ్ చేశారు.

ప్రిన్సిపాల్ సురేంద్ర, వార్డెన్ రామనాథం అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారంటూ బాధిత విద్యార్థినులు వారం రోజుల కిందట టీటీడీ అధికారులను ఆశ్రయించారు. విద్యార్థినుల ఫిర్యాదు మేరకు ఒక కమిటీని ఏర్పాటు చేసి సమగ్ర విచారణ చేపట్టాలంటూ టీటీడీ ఆదేశించింది. టీటీడీ ఆదేశాల మేరకు నిజనిర్ధారణ చేపట్టిన కమిటీ.. ప్రిన్సిపాల్, వార్డెన్ల లైంగిక వేధింపులు నిజమని తేల్చడంతో.. అధికారులు ఆ ఇద్దర్నీ సస్పెండ్ చేశారు.

Crime News: దండుపాళ్యన్ని మించిన కర్నూలు గ్యాంగ్, వివరాలు వెల్లడించిన ఎస్పీ విశాల్

తమను లైంగికంగా వేధించిన ప్రిన్సిపాల్, వార్డెన్లపై దిశ చట్టం కింద కేసు నమోదు చేయాలంటూ విద్యార్థినులు, మహిళా సంఘాలు కళాశాల ఎదుట బైఠాయించి ధర్నా చేపట్టారు. కాగా, విచారణ ఇంకా కొనసాగుతుందని.. పూర్తి కాగానే చర్యలు తీసుకుంటామని టీటీడీ అధికారులు చెప్పారు.