Kuppam : ఏపీలో మున్సిపల్ ఎన్నికలు..అందరి దృష్టంతా కుప్పంపైనే

ఏపీలో 12 మున్సిపాలిటీలకు ఎన్నికలకు జరుగుతున్నా.. అందులో కుప్పంపై మాత్రమే అందరి దృష్టి పడింది. చంద్రబాబు నియోజక వర్గం కావడంతో రాష్ట్రం మొత్తం ఆసక్తి రేపుతోంది.

Kuppam : ఏపీలో మున్సిపల్ ఎన్నికలు..అందరి దృష్టంతా కుప్పంపైనే

Kuppam (1)

AP Municipal elections : ఏపీలో మున్సిపల్‌ ఎన్నికలకు పోలింగ్‌ మొదలైంది. సాయంత్రం 5గంటల వరకు పోలింగ్‌ కొనసాగనుంది. రాష్ట్రంలోని నెల్లూరు కార్పొరేషన్‌తో పాటు కుప్పం, బుచ్చిరెడ్డిపాలెం, ఆకివీడు, జగ్గయ్యపేట, కొండపల్లి, గురజాల, దాచేపల్లి, దర్శి, బేతంచెర్ల, కమలాపురం, రాజంపేట, పెనుకొండ మున్సిపాలిటీలకు పోలింగ్ జరుగుతోంది. వీటితో పాటు రాష్ట్రంలోని మరో 7 కార్పొరేషన్లలో 12 డివిజన్లకు ఎన్నిక నిర్వహిస్తున్నారు. 17న ఫలితాలు వెల్లడిస్తారు.

ఏపీలో 12 మున్సిపాలిటీలకు ఎన్నికలకు జరుగుతున్నా.. అందులో కుప్పంపై మాత్రమే అందరి దృష్టి పడింది. ఈ ఎన్నిక టీడీపీకి ఎంతో ప్రతిష్ఠాత్మకంగా మారింది. చంద్రబాబు నియోజక వర్గం కావడంతో రాష్ట్రం మొత్తం ఆసక్తి రేపుతోంది. కుప్పం పట్టణంలో 25వార్డులు ఉండగా.. ఇప్పటికే ఒక వార్డును వైసీపీ ఏకగ్రీవం చేసుకుంది. దీంతో మిగతా 24వార్డుల్లో ఎన్నికలు జరుగుతున్నాయి.

Polling: ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికలు.. పోలింగ్ ప్రారంభం

ఏపీలో రాజకీయ వేడిని రాజేసింది కుప్పం. చంద్రబాబు గడ్డ మీద.. వైసీపీ జెండా ఎగరేయాలని చూస్తోంది. అన్ని వార్డుల్లో.. తమ పార్టీ అభ్యర్థులే గెలుస్తారని మంత్రి పెద్దిరెడ్డితో పాటు చిత్తూరు జిల్లా నేతలు ధీమా వ్యక్తం చేశారు. ప్రచారంలో.. లోకేశ్ కూడా పంచ్ డైలాగులు బాగానే పేల్చారు. ఫ్లూటు జింక ముందు ఊదండి.. కుప్పం సింహం ముందు కాదంటూ.. లోకల్ రాజకీయాన్ని మరింత రగిల్చారు. దీంతో.. స్టేట్ అటెన్షన్ మొత్తం కుప్పం మీదే ఉంది. చంద్రబాబు ఇలాకాలో.. ఎవరు గెలుస్తారన్నది ఆసక్తిగా మారింది.

కుప్పంలో గెలిచి.. చంద్రబాబు పనైపోయిందని చూపించేందుకు వైసీపీ ప్రయత్నిస్తోంది. అక్కడ విజయం సాధించి.. తమ పట్టు సడలలేదని చెప్పేందుకు టీడీపీ ట్రై చేస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో.. కుప్పం ఎవరివైపు ఉందన్నది నేటితో తేలిపోనుంది. 17న వచ్చే ఫలితాలతో అసలు సీనేంటో బయటపడనుంది. మరోవైపు ఇవాళ కుప్పానికి వెళ్లనున్నారు చంద్రబాబు. ఎన్నికల సరళిని ఆయన పర్యవేక్షించనున్నారు.

Amit Shah: డ్రగ్స్‌ కట్టడి చేయండి.. సీఎంలకు అమిత్‌షా సూచన

కుప్పం నేతలతో చంద్రబాబు టెలికాన్ఫెరెన్స్ నిర్వహించారు. దొంగ ఓట్లకు అవకాశం లేకుండా క్యాడర్ జాగ్రత్తగా పనిచేయాలని ఆదేశించారు. ఎన్నికల్లో అక్రమాలను ఎక్కడికక్కడ అడ్డుకోవాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. దొంగ ఓట్లు, అక్రమాలు ఎక్కడ చోటుచేసుకున్నా వెంటనే ఆధారాలు సేకరించి ఎప్పటికప్పుడు వీడియోలు బయటపెట్టాలని ఆదేశించారు. పోలింగ్ ప్రశాంతంగా, ప్రజాస్వామ్య పద్ధతిలో జరిగేలా శ్రేణులు పని చేయాలని సూచించారు.