Nara Lokesh: విశాఖలో జరిగింది గ్లోబల్ సమ్మిట్ కాదు.. లోకల్ ఫేక్ సమ్మిట్.. జగన్ ఇగో తృప్తి కోసమే ..

విశాఖ పట్టణంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్‌లో ఒప్పందం కుదుర్చుకున్న ఒక్క పరిశ్రమకూడా గ్రౌండ్ అవుతుందని నాకు నమ్మకం లేదని, ఆయా కంపెనీల నుంచి ఎలాంటి ప్రకటన ఎందుకు రాలేదని టీడీపీ నేత నారా లోకేశ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. జగన్ ఇగో తృప్తికోసమే ఈ సమ్మిట్ జరిగిందని లోకేశ్ విమర్శించారు.

Nara Lokesh: విశాఖలో జరిగింది గ్లోబల్ సమ్మిట్ కాదు.. లోకల్ ఫేక్ సమ్మిట్.. జగన్ ఇగో తృప్తి కోసమే ..

Nara Lokesh

Nara Lokesh: విశాఖపట్టణంలో జరిగిన గ్లోబల్ సమ్మిట్‌పై టీడీపీ నేత నారా లోకేశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. విశాఖలో జరిగింది గ్లోబల్ సమ్మిట్ కాదని, లోకల్ ఫేక్ సమ్మిట్ అంటూ విమర్శలు గుప్పించారు. లోకేశ్ చేపట్టిన యువగర్జన పాదయాత్రలో భాగంగా అన్నమయ్య జిల్లా పీలేరులో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా టీడీపీ హయాంలో వచ్చిన పరిశ్రమల వివరాలను విడుదల చేశారు. పరిశ్రమల వద్ద నా సెల్ఫీ ఛాలెంజ్‌కు ప్రభుత్వం నుంచి సమాధానం లేదని, ఎందుకు స్పందించడం లేదని, ఈ ప్రభుత్వం నిద్ర పోతోందంటూ విమర్శించారు. బెదిరింపులతో పరిశ్రమలు తరిమేశారని, పీపీఏలు రద్దు చేయద్దని కేంద్రం చెప్పినా జగన్ ప్రభుత్వం వినలేదన్నారు. జగన్ సీఎం అయ్యాక చాలా పరిశ్రమలు బై బై ఏపీ అని చెప్పి వెళ్లిపోయాయని, అమరరాజా తెలంగాణకు వెళ్ళడం ద్వారా 20వేల ఉద్యోగాలు కోల్పోయామని అన్నారు. విదేశీ పెట్టుబడుల్లో 14వ స్థానంలోకి వెళ్లిపోయామని, జార్ఖడ్ కన్నా వెనుకబడ్డామని లోకేశ్ తెలిపారు. దేశంలో గంజాయిలో మనం నంబర్ వన్ స్థానంలో ఉండటం సిగ్గుచేటని, దేశంలో ఎక్కడ గంజాయి దొరికినా దాని మూలాలు ఏపీలోనే ఉంటున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు.

Nara Lokesh: కోవిడ్ టైంలో బ్రాహ్మణికి దొరికిపోయా.. ఇప్పటికీ కంట్రోల్ తప్పితే మెస్సేజ్ వచ్చినట్లే..

పెట్టుబడుల సమ్మిట్‌లో అంతా ఫేక్ కంపెనీలేనని, అసలు సంతకాలు ఎందుకు చూపడం లేదని లోకేశ్ ప్రశ్నించారు. చాలా కంపెనీల పేర్లు ఎందుకు వెల్లడించలేదని, మేము వెబ్ సైట్ పెట్టిమరీ కంపెనీల వివరాలు వెల్లడించామని గుర్తుచేశారు. లక్ష రూపాయల పెట్టుబడితో ఏర్పడ్డ పులివెందుల కంపెనీ ఇండ్‌సోల్ 76వేల కోట్ల పెట్టుబడితో ఒప్పందం కుదుర్చుకుందని, దీనికి 25వేల ఎకరాలు ఇస్తున్నారని, ఈ కంపెనీకి జగన్ బినామీ అని ఆరోపించారు. 120 కోట్ల పెట్టుబడిగల ఎబీసీ అనే మరో కంపెనీ లక్షా 20వేల కోట్ల పెట్టుబడి పెడుతుందని చెబుతున్నారని, రెండు లక్షల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అయ్యేలా ఫేక్ విద్యుత్ ఒప్పందాలు చేసుకున్నారని లోకేశ్ విమర్శించారు. దావోస్‌లో కుదిరిన ఒప్పందాలు మళ్లీ ఇక్కడ చేసుకున్నట్లు చూపారని, కోడిగుడ్ల మంత్రి నాలుగు నెలలు ఆగితేనే తేలుతుందని అంటున్నారని లోకేశ్ ఎద్దేవా చేశారు. ఒక్క పరిశ్రమ కూడా గ్రౌండ్ అవుతుందని నాకు నమ్మకం లేదని, ఆయా కంపెనీల నుంచి ఎలాంటి ప్రకటన ఎందుకు రాలేదని లోకేశ్ ప్రశ్నించారు. జగన్ ఇగో తృప్తి కోసమే ఈ సమ్మిట్ జరిగిందని లోకేశ్ విమర్శించారు.

Nara Lokesh On Jr NTR : జూ.ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై నారా లోకేశ్ హాట్ కామెంట్స్

175 సీట్లు వస్తాయని భావించే సీఎం జగన్ ప్రజల్లోకి ఎందుకు రావడం లేదని, పరదాలు కట్టుకొని ఎందుకు వెళుతున్నారంటూ లోకేశ్ ప్రశ్నించారు. పొత్తులు అనేవి మా రాజకీయ వ్యూహంలో భాగమని, కలిసి పోటీ చేస్తామని మేము చెప్పామా, ఎందుకు భయపడుతున్నారంటూ వైసీపీ నేతలను లోకేశ్ ప్రశ్నించారు. నాపై దాడి అంటూ జగన్ సింపతీ కోసం ప్రయత్నం చేస్తున్నాడని అన్నారు. సంక్షేమం కోసం జగన్ కన్నా ఖర్చుపెట్టింది టీడీపీ ప్రభుత్వమేనని అన్నారు. మా హయాంలో ఉద్యోగులకు సమయానికి జీతాలు ఇచ్చామని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు. మేము అధికారంలోకి వస్తే పథకాల రద్దు చేస్తామని తప్పుడు ప్రచారం చేస్తున్నారని, 2014లో అధికారంలోకి వచ్చాక అంతకు ముందు ఉన్న పథకాల్లో ఒక్కదాన్నికూడా రద్దు చేయలేదని లోకేశ్ గుర్తు చేశారు. వైఎస్సార్ తెచ్చిన ఆరోగ్యశ్రీ కొనసాగించామని అన్నారు.  కానీ, జగన్ అలా కాదు… మేము తెచ్చిన అనేక పథకాలు రద్దుచేశాడని అన్నారు.

Visakha Global Investors summit : ఏపీలో మూడు పారిశ్రామిక కారిడార్లు రాబోతున్నాయి : మంత్రి గడ్కరి

పులివెందుల వంటి కుటుంబ సీటు నుంచి పోటీ చేసిన వ్యక్తి జగన్. నేను కూడా పార్టీ కంచుకోట నుంచి గెలిచి విజయం సాధించి ఉండవచ్చు. కానీ మంగళగిరిని ఛాలెంజ్ గా ఎంచుకున్నాను. ఎప్పుడూ గెలవని సీటు ఎంచుకొని జగన్ పోటీ చేయాలంటూ లోకేశ్ సూచించారు. పార్టీకి కంచుకోట స్థానంలో గెలిచి చంకలు గుద్దుకుంటున్నారని అన్నారు. ప్రస్తుతం మమల్ని ఇబ్బంది పెట్టిన వారిని పార్టీలోకి తీసుకోబోమని అన్నారు. కర్నూల్లో హైకోర్టు కోసం ఏమి ప్రయత్నాలు చేశారో చెప్పాలని, సుప్రీం కోర్టు సిజేని ఎన్నిసార్లు కలిశారని లోకేశ్ ప్రశ్నించారు.