Lokesh yuvagalam padayatra : యువగళం పాదయాత్ర మళ్లీ మొదలవుతుందా..? నేతలకు లోకేశ్ ఏం చెప్పారంటే

చంద్రబాబు అరెస్ట్ తరువాత నిలిచిపోయిన పాదయాత్రను లోకేశ్ తిరిగి ప్రారంభించే యోచనలో ఉన్నారు. ఎక్కడైతే పాదయాత్ర నిలిచిపోయిందో అక్కడి నుంచి తిరిగి ప్రారంభించనున్నారు. దీని కోసం యత్నాలు చేస్తున్నారు.

Lokesh yuvagalam padayatra : యువగళం పాదయాత్ర మళ్లీ మొదలవుతుందా..? నేతలకు లోకేశ్ ఏం చెప్పారంటే

lokesh yuvagalam padayatra Restart

lokesh yuvagalam padayatra Restart : చంద్రబాబు అరెస్టుతో నారా లోకేశ్ ‘యువగళం’పాదయాత్రను నిలిపివేశారు. తండ్రి చంద్రబాబు అరెస్ట్ తో లోకేశ్ హఠాత్తుగా పాదయాత్రను నిలిపివేశారు. ఓ పక్క తండ్రి చంద్రబాబు అరెస్టు, మరోపక్క ఏపీ ప్రభుత్వం వరుసగా కోర్టుల్లో దాఖలు చేస్తున్న పిటీషన్లు, కోర్టు క్వాష్ పిటీష్ కొట్టివేత..రిమాండ్ పొడిగింపు ఇలా దెబ్బ మీద దెబ్బతో లోకేశ్ ఇక యువగళం పాదయాత్రను కొనసాగిస్తారా..?పూర్తిగా నిలిపివేస్తారా..? అనే సందేహాలు వస్తున్నాయి. ఇటువంటి పరిణామాల మధ్య నారా లోకేశ్ తన పాదయాత్రను తిరిగి ప్రారంభిస్తారా? ఇక పూర్తిగా నిలిపివేస్తారా..అనే వార్తలు వస్తున్న క్రమంలో పాదయాత్రను తిరిగి ప్రారంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

చంద్రబాబు అరెస్ట్ తరువాత ఢిల్లీ వెళ్లిన లోకేశ్ అక్కడే ఉన్నారు. దీంతో పాదయాత్రను తిరిగి ప్రారంభించేందుకు టీడీపీ ముఖ్య నేతలతో టెలీకాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. పాదయాత్రకు తగిన ఏర్పాట్లు చేయాలని సూచించినట్లుగా తెలుస్తోంది.  హైకోర్టులో చంద్రబాబు దాఖలుచేసిన క్వాష్ పిటీషన్ కొట్టివేయటంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటీషన్ సోమవారం (సెప్టెంబర్ 25,2023)న విచారణకు వచ్చే అవకాశం ఉంది. దీనిపై లోకేశ్  న్యాయవాదులతో చర్చలు జరుపుతున్నారు. అదే సమయంలో తిరిగి పాదయాత్రను ప్రారంభించే యోచనలోను ఉన్నారు. ఎన్ని అవాంతరాలు వచ్చినా పాదయాత్రను ఆపేదిలేదని ముందుగానే నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం పాదయాత్రను పూర్తి చేస్తాననే పట్టుదలతో లోకేశ్ ఉన్నట్లుగా తెలుస్తోంది. వచ్చే వారంలో తిరిగి పాదయాత్రను ప్రారంభించేందుకు రెడీ అవుతున్నారని సమాచారం.

Chandrababu Arrest : చంద్రబాబు అరెస్టుకు నిరసనగా రోడ్డెక్కిన తారకరత్న భార్యాపిల్లలు

కాగా త్వరలో రానున్న ఎన్నికల్లో మరోసారి విజయం సాధించాలని వైసీపీ..వైసీపీ పాలన అంతం చేయాలని విపక్షాలు కలిసి కట్టుగా పనిచేస్తున్నాయి. మరీ ముఖ్యంగా టీడీపీ, జనసేన పొత్తు అని చంద్రబాబు అరెస్ట్ తరువాత ఫుల్ క్లారిటీ ఇస్తు  మీడియాకు ప్రకటించేశారు పవన్ కల్యాణ్. దీంతో  వైసీపీ మరింత అప్రమత్తమైంది. పక్కా ప్లాన్ తో ముందుకెళుతున్నట్లుగా కనిపిస్తోంది. దీంట్లో భాగంగానే ఎన్నికలు సమీపిస్తున్న క్రమంలో టీడీపీని దెబ్బ కొట్టేందుకు చంద్రబాబును స్కిల్ డెవలప్ మెంట్ లో అక్రమంగా అరెస్ట్ చేయించారని ఆరోపణలు వస్తున్నాయి.

అదే విషయాన్ని టీడీపీ నేతలు పదే పదే చెబుతున్నారు. చంద్రబాబు సభలకు..కార్యక్రమాలతోను..యువగళం పాదయాత్రకు ప్రజల నుంచి వస్తున్న స్పందనను చూసి వైసీపీకి వచ్చే ఎన్నికల్లో ఓటమి తప్పదని భయపడి దౌర్జన్యాలకు పాల్పడుతోందని ఆరోపిస్తున్నారు. దీంట్లో భాగంగానే చంద్రబాబును స్కిల్ డెవలప్ మెంట్ లో అవినీతి జరిగిందంటూ ఆధారాలు లేకుండానే అక్రమంగా అరెస్ట్ చేశారని మండిపడుతున్నారు.

Chandrababu Arrest : చంద్రబాబు అరెస్టుకు నిసనగా ఐటీ ఉద్యోగులు కార్ల ర్యాలీ, ఏపీ తెలంగాణ సరిహద్దుల్లో భారీగా పోలీసులు మోహరింపు

ఇటువంటి పరిణామాల మధ్య నిలిచిపోయిన పాదయాత్రను తిరిగి ప్రారంభించేందుకు రెడీ అవుతున్నారు లోకేశ్. చంద్రబాబు ఎటువంటి అవినీతికి పాల్పడలేదని..వైసీపీ ప్రభుత్వం కుట్రపూరితంగా కేసులో ఇరికించేందుకు యత్నిస్తు అరెస్ట్ చేసిందనే విషయాన్ని ప్రజల్లోకి పాదయాత్ర ద్వారా ప్రజల్లోకి తెలియజేసేందుకు లోకేశ్ యోచించారని తెలుస్తోంది. చంద్రబాబు విషయంలో వైసీపీ ప్రభుత్వం కక్ష పూరితంగా వ్యవహరిస్తోందనే విషయాన్ని తన పాదయాత్ర ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకే తిరిగి ప్రారంభించనున్నారని తెలుస్తోంది. చంద్రబాబు అరెస్టుతో పాదయాత్ర నిలిచిన ఉమ్మడి తూ.గో. జిల్లా రాజోలు నియోజకవర్గం పొదలాడ నుంచే యువగళాన్ని తిరిగి ప్రారంభించనున్నాట్లుగా తెలుస్తోంది.