ఏపీలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు, కొత్తగా 62మందికి కొవిడ్, కృష్ణా జిల్లాలో ఒకరు మృతి

ఏపీలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 62 పాజిటివ్ కేసులు

  • Published By: naveen ,Published On : May 22, 2020 / 06:09 AM IST
ఏపీలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు, కొత్తగా 62మందికి కొవిడ్, కృష్ణా జిల్లాలో ఒకరు మృతి

ఏపీలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 62 పాజిటివ్ కేసులు

ఏపీలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. గురువారం కాస్త తగ్గినా, శుక్రవారం(మే 22,2020) మళ్లీ పెరిగాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 62 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 2వేల 514కి చేరింది. గడిచిన 24 గంటల్లో 8వేల 415 మంది శాంపిల్స్‌ పరీక్షించగా 62 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయినట్టు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్‌లో తెలిపింది. కరోనాతో కృష్ణా జిల్లాలో ఒకరు మృతి చెందారు. దీంతో కరోనాతో ఇప్పటివరకు మృతి చెందిన వారి సంఖ్య 55కి చేరింది. 

గడిచిన 24 గంటల్లో 51 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు డిశ్చార్జి అయిన వారి సంఖ్య 1,731కి చేరింది. ప్రస్తుతం వివిధ కొవిడ్‌ ఆసుపత్రుల్లో 728 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కొత్తగా నమోదైన పాజిటివ్‌ కేసుల్లో ఎక్కువశాతం కోయంబేడు లింక్ ఉన్నవే. చిత్తూరు జిల్లాలో 4, నెల్లూరు జిల్లాలో 14 కోయంబేడు(తమిళనాడు) కాంటాక్టు కేసులుగా అధికారులు గుర్తించారు.

ఇతర రాష్ట్రాలకు సంబంధించిన కమ్యులేటివ్ పాజిటివ్ కేసులు 153 ఉన్నాయని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ప్రకటించారు. ఈ 153తో 2వేల 514 కలిపితే ఏపీలో మొత్తం కేసుల సంఖ్య 2,667. కాగా, జిల్లాల వారీగా మొత్తం కరోనా కేసుల వివరాలను బులిటెన్‌లో తెలపలేదు. రాష్ట్రంలో అత్యధికంగా కర్నూలు జిల్లాలో 600పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తర్వాత గుంటూరు జిల్లాలో 400కు పైగా కేసులు ఉన్నాయి.

Read: ఏపీలో 2452కు చేరుకున్న కరోనా కేసులు