Visakhapatnam: ‘అగ్నిపథ్’ ఆందోళనలు.. విశాఖ రైల్వే స్టేషన్‌లోకి నో ఎంట్రీ

విశాఖ రైల్వే స్టేషన్‌ను కూడా మూసివేస్తున్నట్లు స్టేషన్ మేనేజర్ సురేష్ తెలిపారు. మధ్యాహ్నం రెండు గంటల వరకు స్టేషన్ లోపలికి ఎవ్వరినీ అనుమతించబోమన్నారు. రెండు గంటల తర్వాత పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.

Visakhapatnam: ‘అగ్నిపథ్’ ఆందోళనలు.. విశాఖ రైల్వే స్టేషన్‌లోకి నో ఎంట్రీ

Visakhapatnam

Visakhapatnam: దేశవ్యాప్తంగా ‘అగ్నిపథ్’ పథకంపై ఆందోళనలు పెరుగుతున్న నేపథ్యంలో రైల్వే స్టేషన్ల వద్ద పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేస్తున్నారు. దీనిలో భాగంగా దేశంలో పలు రైల్వే స్టేషన్లలో సర్వీసులను నిలిపివేశారు. తాజాగా విశాఖ రైల్వే స్టేషన్‌ను కూడా మూసివేస్తున్నట్లు స్టేషన్ మేనేజర్ సురేష్ తెలిపారు. మధ్యాహ్నం రెండు గంటల వరకు స్టేషన్ లోపలికి ఎవ్వరినీ అనుమతించబోమన్నారు. రెండు గంటల తర్వాత పరిస్థితిని బట్టి, ఉన్నతాధికారుల సలహా మేరకు నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఈ నేపథ్యంలో విశాఖ నుంచి వెళ్లే పలు రైళ్లను రద్దు చేశారు. మరికొన్నింటిని అధికారులు దారి మళ్లించారు.

Vijayawada: విజయవాడ రైల్వే స్టేషన్ వద్ద హై అలర్ట్

ప్రస్తుతం విశాఖ రైల్వే స్టేషన్ వద్ద పరిస్థితి అనుకూలంగానే ఉంది. ఎలాంటి అవాంఛిత ఘటనలు జరగకుండా దాదాపు 200 మంది భద్రతా సిబ్బంది స్టేషన్ వద్ద పహారా కాస్తున్నారు. మధ్యాహ్నం రెండు వరకు ప్రయాణికులు ఎవరూ స్టేషన్ వద్దకు రావొద్దని, రిజర్వేషన్ చేసుకున్న వారికి మాత్రమే ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నామని సురేష్ చెప్పారు. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. రైళ్ల రాకపోకలకు సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడు ప్రయాణికులకు అందిస్తున్నట్లు వెల్లడించారు.