Vijayawada: విజయవాడ రైల్వే స్టేషన్ వద్ద హై అలర్ట్

ఆంధ్ర ప్రదేశ్‌లోని విజయవాడ రైల్వే స్టేషన్ వద్ద కూడా హై అలర్ట్ ప్రకటించారు. రైల్వే స్టేషన్‌ను పోలీసులు పూర్తిగా స్వాధీనంలోకి తీసుకున్నారు. స్టేషన్ చుట్టూ ఇనుప కంచెలు వేసి భద్రత ఏర్పాటు చేశారు. అనుమానితులను ప్రశ్నిస్తున్నారు.

Vijayawada: విజయవాడ రైల్వే స్టేషన్ వద్ద హై అలర్ట్

Vijayawada: ‘అగ్నిపథ్’ ఆందోళనల నేపథ్యంలో రైల్వే శాఖ, కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్లలో భద్రత పెంచారు. ఆంధ్ర ప్రదేశ్‌లోని విజయవాడ రైల్వే స్టేషన్ వద్ద కూడా హై అలర్ట్ ప్రకటించారు. రైల్వే స్టేషన్‌ను పోలీసులు పూర్తిగా స్వాధీనంలోకి తీసుకున్నారు. స్టేషన్ చుట్టూ ఇనుప కంచెలు వేసి భద్రత ఏర్పాటు చేశారు. అనుమానితులను ప్రశ్నిస్తున్నారు. రైల్వే స్టేషన్‌కు వెళ్లే అన్ని మార్గాలపై నిఘా పెట్టారు. డీసీపీ విశాల్ గున్ని స్టేషన్ సమీపంలోని అన్ని ప్రాంతాలను పరిశీలించారు. పోలీసులు మరింత అలర్ట్‌గా ఉండాలని సూచించారు. ఆర్‌పీఎఫ్, సివిల్ పోలీసులతో పటిష్ట భద్రత ఏర్పాటు చేసినట్లు ఆయన చెప్పారు.

Agnipath: సికింద్రాబాద్ ఘటన.. రైల్వే శాఖకు భారీ ఆస్తి నష్టం

‘‘సికింద్రాబాద్ ఘటన నేపథ్యంలో విజయవాడ రైల్వే స్టేషన్ విషయంలో పూర్తి జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ముందస్తుగా అదనపు బలగాలను మోహరించాం. నడిపుడి నుంచి అన్ని ప్రాంతాలను పరిశీలించి పోలీసులకు తగిన సూచనలు చేశాం. వాట్సాప్‌లో వచ్చే అబద్దపు సమాచారాన్ని నమ్మవద్దు. స్థానిక పోలీసులు కొందరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడవద్దని ఆంధ్రా యువతను కోరుతున్నాం. భవిష్యత్తును నాశనం చేసుకోవద్దు’’ అంటూ డీసీపీ వివరించారు.