Nara Chandrababu Naidu : చంద్రబాబు భద్రతపై NSG స్పెషల్ ఫోకస్.. రంగంలోకి NSG ప్రత్యేక బృందం

మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు భద్రతపై ఎన్ఎస్జీ స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఎన్ఎస్జీ డీఐజీ స్వయంగా రంగంలోకి దిగారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయానికి వెళ్లిన ఎన్ఎస్జీ డీఐజీ... చంద్రబాబు భద్రతపై కీలక సూచనలు చేశారు. టీడీపీ ఆఫీసులోని ప్రతి గదిని ఎన్ ఎస్జీ బృందం పరిశీలించింది.

Nara Chandrababu Naidu : చంద్రబాబు భద్రతపై NSG స్పెషల్ ఫోకస్.. రంగంలోకి NSG ప్రత్యేక బృందం

Nara Chandrababu Naidu : మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు భద్రతపై ఎన్ఎస్జీ స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఎన్ఎస్జీ డీఐజీ స్వయంగా రంగంలోకి దిగారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయానికి వెళ్లిన ఎన్ఎస్జీ డీఐజీ… చంద్రబాబు భద్రతపై కీలక సూచనలు చేశారు. టీడీపీ ఆఫీసులోని ప్రతి గదిని ఎన్ ఎస్జీ బృందం పరిశీలించింది.

Chandrababu Kuppam Tour: కుప్పంలో వైసీపీ కార్యకర్తల విధ్వంసం .. రోడ్డుపై బైఠాయించి చంద్రబాబు నిరసన

ఇటీవల చంద్రబాబు పర్యటనల్లో తరుచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు అంటూ కేంద్రానికి ఫిర్యాదు చేసింది టీడీపీ. చంద్రబాబు భద్రతపై ఆందోళన వ్యక్తం చేసింది. దీంతో ఎన్ఎస్జీ బృందం చంద్రబాబు భద్రతపై ప్రత్యేక ఫోకస్ పెట్టిందని టీడీపీ వర్గాలు అంటున్నాయి. ఇప్పటికే ఉండవల్లిలోని చంద్రబాబు నివాసాన్ని పరిశీలించిన ఎన్ఎస్జీ బృందం తాజాగా టీడీపీ కేంద్ర కార్యాలయంలో ప్రతి రూమ్ ని పరిశీలించింది. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయానికి ఎన్ఎస్జీ డీఐజీ వెళ్లారు. పార్టీ ఆఫీసులోని ప్రతీ రూమ్ ను ఆయన పరిశీలించారు.

Chandrababu Kuppam Tour: కుప్పంలో టెన్షన్ టెన్షన్.. రెండో రోజు చంద్రబాబు పర్యటన.. అడ్డుకొనేందుకు వైసీపీ ప్లాన్.. భారీ పోలీస్ బందోబస్తు

నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (ఎన్ఎస్జీ) చంద్రబాబుకి భద్రత కల్పిస్తోంది. టీడీపీ ఫిర్యాదు క్రమంలో ఎన్ఎస్జీ డీఐజీ సమీర్ దీప్ సింగ్ స్వయంగా రంగంలోకి దిగారు. ఆయన ప్రత్యేకంగా ఏపీకి వచ్చారు. టీడీపీ కేంద్ర కార్యాలయం, చంద్రబాబు నివాసం దగ్గర భద్రతను ఆయన స్వయంగా పర్యవేక్షించారు. ప్రతి రూమ్ ని ఆయన పరిశీలించారు. చంద్రబాబు ఏ ప్రాంతం నుంచి ఆఫీసుకి వస్తుంటారు. ఏ విధంగా వస్తుంటారు. గతంలో దాడి జరిగిన దాని గురించి కూడా కార్యాలయ సిబ్బందిని అడిగి వివరాలు తెలుసుకున్నారు.

చంద్రబాబు ఏ సమయంలో వస్తారు? ఎక్కడ ఉంటారు? ఆయన రూమ్ ఏది? సందర్శకులు చంద్రబాబుని ఎలా కలుస్తారు? బుల్లెట్ ప్రూఫ్ డోర్లు ఉన్నాయా? చంద్రబాబు భద్రత ఏ విధంగా ఉంటుంది? ఇలా అనేక అంశాల గురించి అని ఎన్ఎస్జీ డీఐజీ ఆరా తీశారు. లోతుగా అధ్యయనం జరిపారు. చంద్రబాబు భద్రతకు సంబంధించి ఎన్ఎస్జీ డీఐజీ తన హైకమాండ్ కు ఒక నివేదిక ఇస్తారని టీడీపీ వర్గాలు తెలిపాయి. నివేదిక కేంద్రానికి అందిన తర్వాత చంద్రబాబు భద్రత విషయంలో ఏదైనా డెవలప్ మెంట్ ఉండే అవకాశం ఉందని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.

Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw

కుప్పంలో చంద్రబాబుపై దాడి యత్నాన్ని టీడీపీ సీరియస్ గా తీసుకుంది. దీనిపై అవసరమైతే మరోసారి కేంద్రానికి ఫిర్యాదు చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. చంద్రబాబు కుప్పం పర్యటన ముగించుకుని వచ్చే వారం అమరావతికి వస్తారు. అప్పుడు పార్టీ నేతలతో చర్చించి దాడులు, భద్రత అంశంపై కేంద్రానికి ఫిర్యాదు చేయాలా? వద్దా? అనే నిర్ణయం చంద్రబాబు తీసుకునే అవకాశం ఉంది. ఏది ఏమైనా చంద్రబాబు భద్రతకు సంబంధించి స్వయంగా ఎన్ఎస్జీ డీఐజీ రంగంలోకి దిగడం, ఏపీకి వచ్చి చంద్రబాబు నివాసం, టీడీపీ కేంద్ర కార్యాలయంలో భద్రతను పర్యవేక్షించడం మేజర్ డెవలప్ మెంట్ గా టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.