Chandrababu Kuppam Tour: కుప్పంలో టెన్షన్ టెన్షన్.. రెండో రోజు చంద్రబాబు పర్యటన.. అడ్డుకొనేందుకు వైసీపీ ప్లాన్.. భారీ పోలీస్ బందోబస్తు

మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటనలో ఉద్రిక్తతలు చోటుచేసుకుంటున్నాయి. బుధవారం కుప్పం నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటించారు. ఈ క్రమంలో వైసీపీ, టీడీపీ నాయకుల మధ్య తీవ్ర ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది.

Chandrababu Kuppam Tour: కుప్పంలో టెన్షన్ టెన్షన్.. రెండో రోజు చంద్రబాబు పర్యటన.. అడ్డుకొనేందుకు వైసీపీ ప్లాన్.. భారీ పోలీస్ బందోబస్తు

Chandrababu kuppam tour

Chandrababu Kuppam Tour: మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటనలో ఉద్రిక్తతలు చోటుచేసుకుంటున్నాయి. బుధవారం కుప్పం నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటించారు. ఈ క్రమంలో వైసీపీ, టీడీపీ నాయకుల మధ్య తీవ్ర ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. గురువారం రెండో రోజు చంద్రబాబు పర్యటన కుప్పంలో కొనసాగనున్న నేపథ్యంలో ఆయన్ను అడ్డుకోవాలని కుప్పం వైసీపీ భావిస్తుంది. బుధవారం రామకుప్పంలో జరిగిన ఘటనలకు నిరసనగా బాబు టూర్‌లో నిరసన, ర్యాలీ చేపట్టే ఆలోచనలో స్థానిక వైసీపీ నేతలు ఉన్నాయి.

Chandrababu Naidu: చంద్రబాబు పర్యటనలో ఉద్రిక్తత.. వైసీపీ కార్యకర్తలపై బాబు ఫైర్

కుప్పం నియోజకవర్గంలోని ప్రతి పంచాయతీ నుంచి వైసీపీ కార్యకర్తలు ఉదయం కల్లా పార్టీ కార్యాలయంకు రావాలంటూ వాట్సప్ సందేశాలు వెళ్లాయి. వైసీపీ పిలుపుకు పోటీగా జిల్లా టీడీపీ సైతం చలో కుప్పంకు పిలుపునిచ్చింది. చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఉన్న టీడీపీ శ్రేణులు కుప్పంకు రావాలని వాట్సాప్ సందేశాలు వెళ్లాయి. ఈ క్రమంలో కుప్పంలోని ప్రైవేటు విద్యా సంస్థలకు సెలవు ఇవ్వాలని స్థానిక వైసీపీ పిలుపునిచ్చింది.

Chandrababu Naidu Kuppam Tour : కుప్పం‌లో చంద్రబాబు నాయుడు 2 రోజుల పర్యటన

రెండు పార్టీల సవాళ్ల నేపథ్యంలో కుప్పంలో చంద్రబాబు పర్యటనలో ఎలాంటి ఉద్రిక్తతలు, ఘర్షణలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. చిత్తూరు జిల్లా ఎస్పీ రిశాంత్ రెడ్డి కుప్పంలోనే ఉంటూ పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. చిత్తూరు జిల్లా నుంచే కాక తిరుపతి జిల్లా, అన్నమయ్య జిల్లాల నుంచి అదనపు పోలీస్ బలగాలు కుప్పంకు చేరుకున్నాయి. మరోవైపు కుప్పంలో ఆర్టీసీ బస్సు సర్వీసులను అధికారులు నిలిపివేశారు. వైసీపీ, టీడీపీ నిరసనలకు పిలుపునివ్వడంతో ముందస్తు చర్యల్లో భాగంగా ఆర్టీసి బస్సులను డిపోలకు పరిమితం చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీస్ శాఖ పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసింది.