Chandrababu Naidu: చంద్రబాబు పర్యటనలో ఉద్రిక్తత.. వైసీపీ కార్యకర్తలపై బాబు ఫైర్

తన పర్యటనలో అడ్డంకులు సృష్టించిన వైసీపీ నాయకులపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. కుప్పంలో వైసీపీ జెండాలు కట్టి, టీడీపీ నాయకుల్ని వైసీపీ నేతలు ఇబ్బంది పడ్డారు. దీనిపై స్పందించిన చంద్రాబాబు వైసీపీ నేతలకు వార్నింగ్ ఇచ్చారు.

Chandrababu Naidu: చంద్రబాబు పర్యటనలో ఉద్రిక్తత.. వైసీపీ కార్యకర్తలపై బాబు ఫైర్

Chandrababu Naidu: కుప్పం వైసీపీ కార్యకర్తలపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. చంద్రబాబు పర్యటించే ప్రాంతాల్లో వైసీపీ జెండాలు ఏర్పాటు చేయడంతో టీడీపీ-వైసీపీ వర్గాల మధ్య బుధవారం ఉద్రిక్తత తలెత్తింది. ఈ నేపథ్యంలో వైసీపీ నేతల తీరును చంద్రబాబు తప్పుబట్టారు.

Odisha school: స్కూలు ఫీజు చెల్లించలేదని విద్యార్థుల్ని లైబ్రరీలో బంధించిన యాజమాన్యం.. తల్లిదండ్రుల ఆగ్రహం

‘‘కుప్పంలో చోటమోటా వైసిపీ నాయకులు తోకలు తిప్పుతున్నారు. వారి తోకలు కత్తిరిస్తా. పులివెందుల రౌడీయిజం చూపించాలని చూస్తున్నారు. జాగ్రత్త.. ఇది నా నియోజకవర్గం. నేను పర్యటనకు వస్తే కావాలనే వైసిపీ జెండాలను కట్టి రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత తట్టెడు మట్టికూడా వేయలేదు. నరేగా నిధులు పందికొక్కుల్లాగా ఎవరు తిన్నారో సమాధానం చెప్పాలి. నిధులు మొత్తం వైసీపీ నాయకుల జేబుల్లోకి వెళ్ళాయి. కుప్పం ప్రజల గుండెల్లో తెలుగుదేశం జెండా ఉంది. శ్రీశైలం నుంచి కుప్పం వరకు హంద్రీ నీవా ద్వారా నీళ్ళందించేందుకు మేము వి.కోట వరకు పనులు పూర్తిచేస్తే.. వైసీపీ నాయకులు కనీసం కుప్పం వరకు పనులు చేయలేదు. రూర్బన్ కార్యక్రమంలో 35 కోట్లు ఇస్తే ఇప్పుదు ఒక్కరూపాయి కూడా ఇవ్వలేదు.

Kapil Dev: ఆ మ్యాచ్ గురించి గుర్తొస్తే.. ఇప్పటికీ నిద్ర పట్టదు: కపిల్ దేవ్

మేం రూ.1350 కోట్లు కుప్పంకి ఇస్తే ఇప్పుడు రూ.63 కోట్ల ముష్టి వేశారు. ఇలా అయితే, నియోజకవర్గం ఎలా అభివృద్ధి చెందుతుంది. కుప్పంలో డ్రిప్ ఇరిగేషన్ పెడితే రైతులు బాగా అభివృద్ధి చెందారు. ఇప్పుడు ఆ ప్రాజెక్ట్‌ని కూడా ఆటకెక్కించారు. నిత్యావసర వస్తువులు కొండెక్కాయి. నవరత్నాలు అని చెప్పి నవ కోతలు పెడుతున్నాడు. ఇంకా ఏమైనా కంప్లెయింట్స్ అవసరం లేదు. పింఛన్లు కట్ చేస్తే నేరుగా న్యాయస్థానానికి వెళ్లి న్యాయం చేస్తాను. పాలరు పైన చెక్ డ్యాములు కట్టి రైతులను అదుకున్నాం. మా ప్రభుత్వం వచ్చిన వెంటనే నిలిచిన పనులు నెలరోజుల్లో పూర్తి చేస్తాం’’ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.