Chandrababu Naidu Kuppam Tour : కుప్పంలో చంద్రబాబు నాయుడు 2 రోజుల పర్యటన
టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు, రేపు తన సొంత నియోజకవర్గమైన చిత్తూరు జిల్లా కుప్పంలో పర్యటించనున్నారు.

Chandrababu Naidu Kuppam Tour
Chandrababu Naidu Kuppam Tour : టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు, రేపు తన సొంత నియోజకవర్గమైన చిత్తూరు జిల్లా కుప్పంలో పర్యటించనున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు కుప్పం చేరుకునే చంద్రబాబు రెండు గంటలకు బస్టాండ్ వద్ద పార్టీ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తారు.
కుప్పం మున్సిపాల్టీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా చంద్రబాబు రెండు రోజుల పర్యటనను పార్టీ నాయకులుఏర్పాటు చేశారు. రేపు సాయంత్రం వరకు కుప్పం నియోజక వర్గం అంతటా రోడ్ షోలు, నాయకుల ఇళ్లకు వెళ్లి పరామర్శించటం చేస్తారు చంద్రబాబు.
Also Read : Constable Suicide : వికారాబాద్‌లో పోలీసు కానిస్టేబుల్ ఆత్మహత్య
పంచాయతీ నుంచి మున్సిపాలిటీగా అప్ గ్రేడ్ అయిన కుప్పం మున్సిపాల్టీలో త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. కనుక ఈ రెండు రోజులు చంద్రబాబు కుప్పం నియోజకవర్గంలోనే వివిధ కార్యక్రమాల్లో పాల్గోనేలా తెలుగు తమ్ముళ్లు ఏర్పాట్లు చేశారు. కుప్పం పంచాయితీ, స్ధానికి సంస్ధల ఎన్నికల్లో పార్టీ ఓటమి చెందాక చంద్రబాబు నాయుడు తొలిసారిగా కుప్పం వస్తున్నారు.