Ongole RTO : కారు తీసుకెళ్లడంపై మాజీ మంత్రి బాలినేని కామెంట్స్

భాదితులు తిరుపతిలో దేవుని దర్శనం చేసుకుంటున్నట్లు, వారు వచ్చిన అనంతరం పిలిపించి ఘటనపై ప్రభుత్వం తరుపున క్షమాపణ కోరబోతున్నామన్నారు. ఇప్పటికే విచారణ జరుగుతోందని, సీఎం సభ ముగిసిన...

Ongole RTO : కారు తీసుకెళ్లడంపై మాజీ మంత్రి బాలినేని కామెంట్స్

Balineni

Ex Minister Balineni Comments : ఒంగోలులో తిరుపతికి వెళుతున్న ఓ భక్తుడి వద్ద నుంచి కారు తీసుకెళ్లిన ఘటన రాష్ట్రంలో ప్రకంపనాలు సృష్టిస్తోంది. ప్రతిపక్షాల నుంచే కాకుండా.. ఇతర వ్యక్తుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో మాజీ మంత్రి బాలినేని స్పందించారు. కనీస మానవత్వం లేకుండా తిరుపతికి వెల్లే భక్తుడి కారుని బలవంతంగా తీసుకోవడం అన్యాయమన్నారు. మంత్రి ఆదిమూలపు సురేష్ ని కానీ తనను కూడా అడగకుండా ఈ ఘటనకు పాల్పడటం చాలా బాధగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి కారకులైన సంఘటన ప్రాంతంలో ఉన్న సిబ్బందిని, ఇన్స్ పెక్టర్ అధికారిని సస్పెండ్ చేయడం జరిగిందన్నారు. ప్రస్తుతం బాధితులు తిరుపతిలో దేవుని దర్శనం చేసుకుంటున్నట్లు, వారు వచ్చిన అనంతరం పిలిపించి ఘటనపై ప్రభుత్వం తరపున క్షమాపణ కోరబోతున్నామన్నారు. ఇప్పటికే విచారణ జరుగుతోందని, సీఎం సభ ముగిసిన అనంతరం ఘటనలో జిల్లా అధికారుల పాత్ర కూడ ఉన్నట్లు తేలితే వారిపైనా కూడా చర్యలు తీసుకుంటామని మాజీ మంత్రి బాలినేని స్పష్టం చేశారు.

Read More : Ongole : చాలా కోపం వస్తోంది.. వైసీపీ ప్రభుత్వంపై బాబు సంచలన వ్యాఖ్యలు

సీఎం జగన్ రెండోసారి మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరించిన సంగతి తెలిసిందే. మొదటి కేబినెట్ లో మంత్రిగా కొనసాగిన మంత్రి బాలినేనికి మరోసారి ఛాన్స్ ఇవ్వలేదు. పదవి రాలేదని తీవ్ర అసంతృప్తితో ఉన్న బాలినేని బుజ్జగించేందుకు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రయత్నించారు. అయినా ఫలితం రాకపోవడంతో బాలినేనిని.. సీఎం తన క్యాంపు కార్యాలయానికి పిలుపించుకుని మాట్లాడారు. అనంతరం బాలినేని అలక వీడారు. ముఖ్యమంత్రి ఏ బాధ్యత ఇచ్చినా.. చేపట్టేందుకు సిద్ధమని ప్రకటించారు. తొలిసారిగా ప్రకాశం జిల్లాకు వచ్చిన బాలినేనికి వైసీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. చిలకలూరిపేట మండలం బొప్పూడి ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భారీ కాన్వాయ్ తో బాలినేని ఒంగోలుకు వెళ్లారు. అక్కడ సీఎం జగన్ సభా ఏర్పాట్లను మంత్రి సురేష్ తో కలిసి ఆయన పరిశీలించారు. వైఎస్సార్ సున్నా వడ్డీ మూడో విడత ప్రారంభ కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొన్నారు. దీంతో పాటు వివిధ కార్యక్రమాలకు ఆయన హాజరయ్యారు.