Operation Tiger T108 : నల్లమల అడవిలో ‘ఆపరేషన్ మదర్ టైగర్ 108 ఫెయిల్’ పిల్లికూనల వద్దకు రాని తల్లి.. ఆందోళనలో అధికారులు

అమ్మకోసం అల్లాడిపోయే పులి కూనలను తల్లి వద్దకు చేర్చటానికి అటవీశాఖ అధికారులు నానా పాట్లు పడుతున్నారు. నల్లమల అడవుల్లో తల్లి పులి కోసం గాలిస్తున్నారు. తల్లి పులి ఉందనే ప్రాంతానికి పిలికూనల్ని తీసుకెళ్లినా తల్లిపులి మాత్రం పిల్లల వద్దకు రాలేదు.దీంతో అధికారుల యత్నాలు ఫలించలేదు.

Operation Tiger T108 : నల్లమల అడవిలో ‘ఆపరేషన్ మదర్ టైగర్ 108 ఫెయిల్’ పిల్లికూనల వద్దకు రాని తల్లి.. ఆందోళనలో అధికారులు

Operation Tiger T108 : అమ్మకోసం అల్లాడిపోయే పులి కూనలను తల్లి వద్దకు చేర్చటానికి అటవీశాఖ అధికారులు నానా పాట్లు పడుతున్నారు. నల్లమల అడవుల్లో తల్లి పులి కోసం గాలిస్తున్నారు. 350 సిబ్బంది, 50 మందికి పైగా అటవీ అధికారులు తల్లి పులి కోసం వేయి కళ్లతో గాలిస్తున్నారు. నంద్యాల జిల్లాలోని నల్లమల అడువుల్లో అర్థరాత్రి కూడా ఆపరేషన్ మదర్ టైగర్ ను కొనసాగిస్తున్నారు అధికారులు. అయినా తల్లిపులి పిల్లల చెందకు రావటానికి ఇష్టపడటంలేదు. దీంతో నాలుగు పులి కూనల పరిస్థితి హృదయ విదాకరంగా మారింది. నాలుగు పులిపిల్లలను తల్లి వద్దకు చేర్చేందుకు ఫారెస్టు అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. దీని కోసం ఆపరేషన్ మదర్ టైగర్ 108 పేరుతో యత్నాలు చేస్తున్నారు.

ముసలిమడుగు రేంజ్ దోమకుంట ప్రాంతంలో తల్లిపులి సంచారాన్ని అధికారులు గుర్తించిన అధికారులు ఆ ప్రాంతానికి పులికూనలు ప్రత్యేక వాహనాల్లో పులి పిల్లలను తీసుకెళ్లారు ఫారెస్ట్ అధికారి శ్రీనివాస్ నేతృత్వంలో బృందం. అలా అర్థరాత్రి నల్లమల అడవిలో గంటల తరబడి తల్లిపులి కోసం 92 గంటలపాటు ఎదురు చూశారు. కానీ తల్లిపులి జాడే కనిపించలేదు. పిల్లల కోసం తల్లిపులి రాకపోవటంతో ఇక చేసేదిలేక అధికారులు పులికూనలను తిరిగి ఆత్మకూరు క్యాంప్ ఆఫీసుకు తరలించారు. పాపం అమ్మపాలు తాగి అమ్మతో ఆడుకుంటూ వేట నేర్చుకోవాల్సిన పులి కూనలు అటవీశాఖ అధికారులు పెట్టింది తిని జీవిస్తున్నాయి.

బుధవారం (మార్చి8,2023) సాయంత్రం ముసలిమడుగు గ్రామం అడవిముక్కల ప్రాంతంలో పెద్ద పులి సంచరిస్తోందని ఓ గొర్రెల కాపరి ఇచ్చిన సమాచారంతో ఆ ప్రాంతంలో పెద్ద పులి సంచారాన్ని అధికారులు గుర్తించారు. దీంతో ఆ ప్రాంతానికి పెద్ద పులి పిల్లలను శ్రీనివాస్ నేతృత్వంలో తరలించినా తల్లిపులి పిల్లల దగ్గరకు రాకపోవటంతో అధికారులు యత్నిలు ఫలించకుండాపోయాయి. కాగా..మనుషులు తాకిన పిల్లలను తల్లి పులి తిరిగి దగ్గరకు రానిస్తుందా?లేదా అన్నది ఉత్కంఠ రేపుతోంది. ఇటువంటి పరిస్థితుల్లో బిడ్డలను చేరదీసే విషయంలోతల్లి పులి ఎలా స్పందిస్తోనని అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. సాధారణంగా మనుషుల స్పర్శ తగిలిన పులి కూనలను తల్లి దగ్గరకు రానివ్వదు. గతంలో ఇలాంటి అనుభవాలు ఎదురైన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. పులి క్రూర మృగం.. వేటే దాని ప్రధాన లక్షణం.

తల్లికి దూరమైన పులి పిల్లలు అటవీ అధికారులు ఇచ్చిన పాలు తాగుతున్నాయి. పెట్టిన ఆహారం తింటున్నాయి. వాటి ఆలనా పాలనా అధికారులు చూస్తూ చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారు. దీంతో అవి క్రూరత్వాన్ని కోల్పోయి సాధు జంతువుగా మారొచ్చని తల్లి పులి భావిస్తుందని అధికారులు చెబుతున్నారు. అందుకే ఒక్క సారి దూరమైన పిల్లలను తల్లి పులి మళ్లీ దగ్గరకు చేర్చుకోదని భావిస్తున్నారు. ఈ కారణంగానే జూకు తరలించాలని..తల్లిపులి కూనల్ని దగ్గరకు చేర్చుకోవటానికి ఆసక్తి చూపించకపోతే ఇక ఆ పులి పిల్లలను జూకు తరలించాల్సి పరిస్థితి ఏర్పడుతుంది.