Pawan Kalyan : వైసీపీ ఒక్క స్థానం కూడా గెలవకూడదు : పవన్ కళ్యాణ్
రాజకీయాల్లో మూడో వంతు మహిళలు ఉండాలన్నారు. మహిళా రిజర్వేషన్ల విషయంలో జనసేన ముందుంటుందని తెలిపారు.

Pawan Kalyan (3)
Janasena Leaders Meeting : ఉభయగోదావరి జిల్లాలోని 34 స్థానాల్లో వైసీపీ ఒక్క స్థానం కూడా గెలవకూడదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. కుల ప్రాతిపదికన రాజకీయం చేస్తే వ్యవస్థ నాశనం అవుతుందని.. వైసీపీ ఇదే చేస్తుందని ఆరోపించారు. పార్టీ పటిష్టత చెందాలంటే భావజాలం అవసరం అన్నారు.
అంబేద్కర్ కోనసీమ జిలా రాజోలు జనసేన నేతల సమావేశంలో పవన్ కళ్యాణ్ మాట్లాడారు. గత ఎన్నికల్లో రాజోలులో వెలిగిన చిరుదీపం కడప రాజంపేట వరకు వెలుగుతుందన్నారు. 5 వేల కోట్ల రూపాయలు తిన్న వాడు పరి పాలిస్తున్నాడని విమర్శించారు.
రాజకీయాల్లో మూడో వంతు మహిళలు ఉండాలన్నారు. మహిళా రిజర్వేషన్ల విషయంలో జనసేన ముందుంటుందని తెలిపారు. పార్టీలో వర్గాలు ఉండటం తప్పుకాదు.. అయితే పార్టీని దిగజార్చే విధంగా ఉండకూడదన్నారు.