PawanKalyan’s Janasena 10th formation day: సభా ప్రాంగణానికి చేరుకున్న పవన్ కల్యాణ్.. మరికొద్ది సేపట్లో ప్రసంగించనున్న జనసేనాని.. LiveUpdates
జనసేన పార్టీ 10వ వార్షికోత్సవ సభ వేదిక వద్దకు పవన్ కల్యాణ్ చేరుకున్నారు. రాత్రి తొమ్మిది గంటల తర్వాత పవన్ సభా వేదికపైకి వచ్చారు. ఆలస్యం అయినప్పటికీ జనసేన కార్యకర్తలు పవన్ ప్రసంగం కోసం ఎదురు చూస్తున్నారు. లక్షలాది మందితో సభా ప్రాంగణం కిటకిటలాడుతోంది.

Pawan Kalyan Janasena 10th formation day: మచిలీపట్నంలో జరుగుతున్న జనసేన ఆవిర్భావ సభా వేదిక వద్దకు పార్టీ అధినేత పవన్ కల్యాణ్ చేరుకున్నారు. వారాహి వాహనంలో రావడం ఆలస్యం కావడంతో, వాహనం దిగి కారులోనే సభకు బయల్దేరారు. ఇప్పటికే ఆలస్యం కావడం వల్ల కారులో సభా వేదికకు చేరుకున్నారు. మరికొద్ది సేపట్లో పవన్ ప్రసంగం ప్రారంభం అవుతుంది. ఆలస్యం అయినప్పటికీ జనసేన కార్యకర్తలు పవన్ ప్రసంగం కోసం ఎదురు చూస్తున్నారు.
LIVE NEWS & UPDATES
-
కారులో బయల్దేరిన పవన్ కల్యాణ్
మచిలీపట్నంలోని సభావేదిక వద్దకు పవన్ కల్యాణ్ కారులో బయల్దేరారు. వారాహి వాహనంలో రావడం వల్ల ఆలస్యమవుతుండటంతో పవన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. వారాహి వాహనం చుట్టూ అభిమానులు భారీ ఎత్తున ఉండటం వల్ల వాహనం నెమ్మదిగా కదలాల్సి వస్తోంది. ఇలాగే సాగితే సభా వేదిక వద్దకు చేరుకోవడానికి చాలా ఆలస్యం అయ్యే అవకాశం ఉండటంతో పవన్ కారులో బయల్దేరారు. దీంతో మరికొద్ది సేపట్లోనే పవన్ సభా ప్రాంగణానికి చేరుకుంటారు.
-
జనసేన పొత్తులపై చేగొండి హరిరామ జోగయ్య తనయుడి సంచలన వ్యాఖ్యలు
జనసేన ఆవిర్భావ సభలో కీలక పరిణామం చోటు చేసుకుంది. జనసేన పీఏసీ సభ్యుడు, జోగయ్య తనయుడు చేగొండి సూర్యప్రకాష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు చేతగాని పాలనకు, జగన్ రాక్షస పాలనకు చరమగీతం పాడాల్సిన సమయం వచ్చిందన్నారు. జనం వెంట ఉండగా, ఏ ఒక్కరితో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం జనసేనానికి లేదన్నారు. ఒక్కొక్కరుగా వెళ్లి 100 సీట్లు పైనే గెలిపిస్తామని ధీమా వ్యక్తం చేశారు. పొత్తులు అవసరం లేదనేలా చేగొండి ప్రకాష్ చేసిన వ్యాఖ్యలపై పార్టీ శ్రేణుల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. అయితే, మరికొద్ది సేపట్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ అంశంపై క్లారిటీ ఇస్తారని జనసైనికులతో పాటు రాష్ట్ర ప్రజలు కూడా ఎదురు చూస్తున్నారు.
-
ఆలస్యంగా చేరుకోనున్న పవన్ కల్యాణ్
పవన్ వారాహి యాత్ర నెమ్మదిగా సాగుతోంది. విజయవాడ నుంచి మొదలైన ఈ యాత్ర మచిలీపట్నంలోని ‘దిగ్విజయ భేరి’ సభకు చేరుకునేందుకు ఇంకొంత సమయం పడుతుంది. దారి పొడవునా భారీగా వాహనాలు, జన సమూహం ఉండటంతో ‘వారాహి’ నెమ్మదిగా కదులుతోంది. చీకటిపడ్డప్పటికీ అభిమానులు వాహనంతోనే సాగుతున్నారు. దీంతో నిర్ణీత సమయంకంటే పవన్ సభకు చేరుకునేందుకు మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉంది. దారి పొడవునా పవన్ అలసిపోకుండా ప్రజలు, కార్యకర్తలు, అభిమానులకు అభివాదం చేస్తూనే ఉన్నారు. అయితే, పవన్ వెళ్లే మార్గంలో అనేక చోట్ల విద్యుత్ సరఫరా లేకపోవడంపై జనసేన శ్రేణులు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
-
జనసేన ఆవిర్భావ సభలో కౌలు రైతులకు సాయం
జనసేన పదో వార్షికోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్న ‘దిగ్విజయ భేరి’ సభలో పార్టీ తరఫున కౌలు రైతు కుటుంబాలకు ఆర్థిక సాయం చేయబోతున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఆత్మహత్యకు పాల్పడ్డ కౌలు రైతు కుటుంబాలకు లక్ష రూపాయల చొప్పున ఆర్థిక భరోసా చెక్కులు అందజేయనున్నారు. పవన్ కల్యాణ్ ఈ చెక్కులు పంపిణీ చేస్తారు.
-
జన ఉప్పెనకు స్తంభించిన విజయవాడ.. పవన్‌కు అడుగడుగునా ఘన స్వాగతం
విజయవాడ నుంచి సాగుతున్న పవన్ వారాహి విజయ యాత్రకు అభిమానులు, ప్రజలు పెద్దఎత్తున జయజయ ధ్వానాలు పలుకుతున్నారు. ఆటోనగర్ వద్ద పవన్ కళ్యాణ్‌కు వీర మహిళలు, జనసైనికులు హారతులతో స్వాగతం పలికారు. వారాహి యాత్ర నేపథ్యంలో బందరు రోడ్డు (65వ నెంబర్ జాతీయ రహదారి) కిక్కిరిసిపోయింది. జన ఉప్పెనకు విజయవాడ నగరం స్తంభించిపోయింది. ఆటోనగర్, కానూరు, కామయ్యతోపులలో పవన్‌కు జనసేన శ్రేణులు గజమాలలతో అపూర్వ స్వాగతం పలికారు. కార్యకర్తలు వేలాది బైకులు, వందలాది కార్లతో భారీ ర్యాలీగా ఆవిర్భావ సభకు తరలివస్తున్నారు. ప్రతి ఒక్కరికీ అభివాదం చేస్తూ జనసేనాని ముందుకు కదులుతున్నారు.
-
జనసేన ఆవిర్భావ సభా వేదిక వద్ద కోలాహలం
మచిలీపట్నంలో జరుగుతున్న జనసేన పదో వార్షికోత్సవ సభా వేదిక వద్ద కోలాహలం నెలకొంది. జనసేన శ్రేణులు, కార్యకర్తలు, పవన్ అభిమానులతో సభా ప్రాంగణం అంతా సందడి వాతావరణం నెలకొంది. వీఐపీ, వీవీఐపీ పాసులు ఉన్న వారినే ప్రత్యేక గ్యాలరీల్లోకి అనుమతిస్తున్నారు. మూడు ద్వారాల గుండా అభిమానుల్ని సభా ప్రాంగణంలోకి పంపిస్తున్నారు. సభా వేదికపై సాంస్కృతిక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఆటోనగర్ నుంచి మచిలీపట్నం వరకు దారి పొడవునా పవన్‌కు జనసేన శ్రేణులు ఘన స్వాగతం పలుకుతున్నాయి. మరికొద్దిసేపట్లో పవన్ కల్యాణ్ సభా వేదిక వద్దకు చేరుకుంటారు. ముందుగా కౌలు రైతు కుటుంబాలను పవన్ పరామర్శిస్తారు. పదేళ్లపాటు జనసేన చేపట్టిన కార్యక్రమాలు, భవిష్యత్తులో చేయబోయే కార్యక్రమాలను పవన్ సభావేదికపై వివరిస్తారు.
-
జనసంద్రమైన రహదారులు.. పవన్‌కు వీర మహిళల స్వాగతం
విజయవాడ నుంచి పవన్ కల్యాణ్ మచిలీ పట్నం బయల్దేరిన సంగతి తెలిసిందే. వారాహి వాహనంపై నుంచి ప్రజలకు అభివాదం చేస్తూ పవన్ ముందుకు సాగుతున్నారు. పవన్ కళ్యాణ్‌కు వీర మహిళలు అడుగడుగునా స్వాగతం పలుకుతున్నారు. భారీ సంఖ్యలో అభిమానులు ఉండటంతో బందర్ రోడ్డులో పవన్ కళ్యాణ్ ర్వాలీ మెల్లగా సాగుతోంది. పవన్ వెళ్లే మార్గమంతా జనసంద్రమైంది. రోడ్డుకు ఇరుపక్కలా భారీ ఎత్తున అభిమానులు, కార్యకర్తలు పవన్‌కు స్వాగతం చెబుతున్నారు.ఈ ర్వాలీతో బందర్ రోడ్డులో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు
-
కృష్ణా జిల్లా వ్యాప్తంగా 30 పోలీస్ యాక్ట్ అమలు
పవన్ సభ నేపథ్యంలో విజయవాడ నుంచి మచిలీపట్నం వరకు హై టెన్షన్ నెలకొంది. కృష్ణా జిల్లా వ్యాప్తంగా 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.
-
ఐదు గంటలకు సభా ప్రాంగణానికి పవన్..
విజయవాడ నుంచి బయల్దేరిన పవన్ కల్యాణ్ సాయంత్రం ఐదు గంటలకు మచిలీపట్నం సభా ప్రాంగణానికి చేరుకోనున్నారు. తాడిగడప జంక్షన్, పోరంకి జంక్షన్, పెనమలూరు జంక్షన్, పామర్రు గుడివాడ సెంటర్, గూడూరు సెంటర్ మీదుగా పవన్ యాత్ర సాగుతుంది.
-
బీసీ డిక్లరేషన్ ప్రకటించనున్న జనసేన?
జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పవన్ కల్యాణ్ ఈ రోజు బీసీ డిక్లరేషన్ ప్రకటించే అవకాశం ఉంది. పవన్ తన పార్టీ ఎన్నికల అజెండాను ప్రకటిస్తారు. ఈ సభ ద్వారా జనసేన-టీడీపీ పొత్తులపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. పార్టీ భవిష్యత్ ప్రణాళికను ప్రకటించే అవకాశం ఉంది.
-
మచిలీ పట్నం బయల్దేరిన పవన్ కల్యాణ్
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ మచిలీ పట్నం బయల్దేరారు. విజయవాడ ఆటో నగర నుంచి అభిమానుల సమక్షంలో, వారాహి వాహనంపై ర్యాలీగా బయల్దేరారు. సాయంత్రానికి ఆయన మచిలీపట్నం చేరుకుంటారు. అభిమానులకు అభివాదం చేస్తూ, ఆయన యాత్ర సాగుతోంది. అక్కడ జరిగే జనసేన పదవ వార్షికోత్సవ సభలో పాల్గొంటారు. ఈ సందర్భంగా తన పార్టీ అజెండా ప్రకటించే అవకాశం ఉంది.
విజయవాడలోని ఆటోనగర్ చేరుకున్న జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. మరి కాసేపట్లో వారాహిలో మచిలీపట్నంకు బయలదేరనున్న పవన్ కళ్యాణ్ గారు.#JSP10thFormationDayMeet pic.twitter.com/xF148XQYtq
— JanaSena Party (@JanaSenaParty) March 14, 2023
-
అవసరమైతే వైద్య సాయం కోసం..
కార్యకర్తల ఆకలి తీర్చడానికి..
జనసేన పార్టీ ఆవిర్భావ సభకి 18 కిలోమీటర్లు దూరంలో ఉన్న పాండ్రక గ్రామ ప్రజలు డబ్బులు పోగుచేసుకొని వాళ్లు ఊరు మీదగా వెళ్తున్న కార్యకర్తలను ఆపి ప్రేమగా భోజనం పెడుతున్నారు 🙏#JSP10thFormationDayMeet pic.twitter.com/hdiZnHelCT
— Sowmya ♥️ (@ManOfCases) March 14, 2023
-
నోవాటెల్ వద్ద అభిమానుల సందడి
నోవోటల్ దగ్గర @PawanKalyan గారి రాక కోసం ఎదురుచూస్తున్న జన సైనికులు.🔥🔥🔥 pic.twitter.com/9Ocymfi8K8
— JanaSena Samhitha (@JSPSamhitha) March 14, 2023
" జయహో వారాహి " ♥️ #JSP10thFormationDayMeet pic.twitter.com/xULCkAqETQ#ChaloMachilipatnam 🔥#JanaSenaFormationDay
జై జనసేన✊💪 #VoteForGlass 🥛 #JSPForNewAgePolitics#JanaSenaParty #PawanKalyan— Jai Janasena 🥛*⃣ (@KJagadeesh_JSP) March 14, 2023
-
తరలివెళ్తున్న కార్యకర్తలు, అభిమానులు
♥️🙏#JSP10thFormationDayMeetpic.twitter.com/ZcDEz6pCRA
— Pawanism Network (@PawanismNetwork) March 14, 2023
బుల్లి ఫ్యాన్
-
పవన్ చిత్రపటాలకు క్షీరాభిషేకం
బెంజ్ సర్కిల్ దగ్గర నుంచి మచిలీపట్నం వరకు జనసేన హోర్డింగ్ లతో అభిమానులు హోరెత్తించారు. పవన్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేస్తున్నారు.
-
వారాహి వాహనంతో సెల్ఫీలు
జనసేన ఆవిర్భావ భారీ సభకు ఏర్పాట్లు పూర్తి
సభా ప్రాంగణానికి చేరుకుంటున్న జన సైనికులు, పవన్ అభిమానులు
దాదాపు 2 లక్షల మంది పైగా వస్తారని అంచనా
విజయవాడ ఆటోనగర్ లో వారాహి వాహనం
విజయవాడ ఆటోనగర్ ఎగ్జిబిషన్ సొసైటీ హాల్ లో వాహనం
వారాహి వాహనం చూసేందుకు పోటీపడుతున్న జనం
వారాహి వాహనంతో సెల్ఫీలు
ఆయా ప్రాంతాల్లో పోలీసుల బందోబస్తు
-
ఈ ప్రాంతాల మీదుగా పవన్ పయనం
పవన్ కల్యాణ్ ఆటోనగర్ ప్రాంతం నుంచి వారాహి వాహనంలో తాడిగడప జంక్షన్, పోరంకి జంక్షన్, పెనమలూరు జంక్షన్, పామర్రు- గుడివాడ సెంటర్ (బైపాస్), గూడూరు సెంటర్ మీదుగా సాయంత్రం 5 గంటలకు మచిలీపట్నంలోని సభా ప్రాంగణానికి చేరుకుంటారు.