Kuppam: కుప్పంలో దొంగ ఓటర్లు.. టీడీపీ ఆందోళనలు.. పట్టుకున్న పోలీసులు

చంద్రబాబు నాయుడు ప్రాతినిథ్యం వహిస్తోన్న కుప్పం అసెంబ్లీ నియోజకవర్గంలో మున్సిపల్ ఎన్నికలు హీట్ పుట్టిస్తున్నాయి.

Kuppam: కుప్పంలో  దొంగ ఓటర్లు.. టీడీపీ ఆందోళనలు.. పట్టుకున్న పోలీసులు

Kuppam

Kuppam: తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు ప్రాతినిథ్యం వహిస్తోన్న కుప్పం అసెంబ్లీ నియోజకవర్గంలో మున్సిపల్ ఎన్నికలు హీట్ పుట్టిస్తున్నాయి. మున్సిపాలిటీలోని 24 వార్డుల్లో పోలింగ్ జోరుగా సాగుతోండగా.. దొంగ ఓట్లు కలకలం సృష్టిస్తుంది.

కుప్పంలోని 16వ వార్డులో వైసీపీ నేతలు దొంగ ఓట్లు వేయిస్తున్నారంటూ టీడీపీ నేతలు ఆందోళనకు దిగారు. పోలీసులతో తీవ్ర వాగ్వాదానికి దిగారు. కుప్పంలో అధికార వైసీపీ బరితెగిస్తోందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. కుప్పంలో వైసీపీ దొంగ ఓటర్లను టీడీపీ శ్రేణులు అడ్డుకుంటున్నాయి. ఐడీ కార్డు అడిగితే దొంగ ఓటర్లు సమాధానం చెప్పలేకపోతున్నారు.

యథేచ్ఛగా దొంగ ఓట్లు పోల్ అవుతున్నా పోలీసులు పట్టించుకోవట్లేదని నారాలోకేష్ కూడా విమర్శించారు. బస్సుల్లో సోదాల పేరుతో పోలీసులు ఓవరాక్షన్ చేస్తున్నారని అంటున్నారు.

Coronavirus Update: దేశంలో తగ్గిన యాక్టీవ్ కరోనా కేసులు.. లేటెస్ట్ లెక్కలు ఇవే!

కుప్పం మున్సిపాలిటీలో మొత్తం 24 వార్డుల కోసం పోలింగ్ జరుగుతుండగా.. 600 మంది పోలీసులను మోహరింపజేశారు. మొత్తం 48 పోలింగ్ సెంటర్లను ఏర్పాటు చేయగా.. 57 వేల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 230 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.

Nara Lokesh: పోలీసుల ముందే దొంగ ఓట‌ర్లు కాలరెగ‌రేసి వెళ్లి ఓటేస్తున్నారు