MLC Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్.. 16న ఫలితాలు వెల్లడి

తెలంగాణకు సంబంధించి హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి పోలింగ్ జరిగింది. ఏపీకి సంబంధించి తొమ్మిది ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నిక జరిగింది. ఇందులో మూడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలు, రెండు టీచర్ ఎమ్మెల్సీ స్థానాలు, నాలుగు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలు ఉన్నాయి.

MLC Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్.. 16న ఫలితాలు వెల్లడి

MLC Elections: తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్‌లలో సోమవారం జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. తెలంగాణకు సంబంధించి హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి పోలింగ్ జరిగింది. ఏపీకి సంబంధించి తొమ్మిది ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నిక జరిగింది.

Goa Attack: గోవాలో టూరిస్టులపై కత్తులు, తల్వార్లతో గూండాల దాడి.. స్పందించిన సీఎం

ఇందులో మూడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలు, రెండు టీచర్ ఎమ్మెల్సీ స్థానాలు, నాలుగు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలు ఉన్నాయి. ఏపీలో 9 ఎమ్మెల్సీ స్థానాలకుగాను 10,59,420 మంది ఓటర్లున్నారు. పోలింగ్ కోసం 1,538 కేంద్రాలు ఏర్పాటు చేశారు. వీటిలో సమస్యాత్మకమైన కేంద్రాల్లో మరింత బందోబస్తు, వీడియో రికార్డింగ్ వంటివి ఏర్పాటు చేశారు. ఈ ఎన్నికల సందర్భంగా ఏపీలో అనేక చోట్ల ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. తిరుపతి, పార్వతీపురం, తాడిపత్రి, ప్రకాశం జిల్లా సహా పలు చోట్ల టీడీపీ, వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణ తలెత్తింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఎన్నిక కొనసాగింది.

Fire Accident: ముంబై మార్కెట్‌లో భారీ అగ్ని ప్రమాదం.. 20 షాపులు దగ్ధం

సాయంత్రం నాలుగు గంటల లోపు క్యూలైన్లలో నిలుచున్న వారికి తర్వాత కూడా ఓటు వేసే అవకాశం కల్పించారు. తెలంగాణకు సంబంధించి దాదాపు 90 శాతం పోలింగ్ నమోదైనట్లు తెలుస్తోంది. తెలంగాణలో ఎన్నిక ముగిసిన దృష్ట్యా బ్యాలెట్ బాక్సులను హైదరాబాద్, సరూర్ నగర్‌లోని ఇండోర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్‌లో భద్ర పరుస్తారు. మార్చి 16న ఉదయం ఎనిమిది గంటల నుంచి ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. సాయంత్రానికల్లా ఫలితాలు వెలువడుతాయి.