YS Viveka Case..Ajeya Kallam : వివేకా కేసులో నాకు తెలిసిన సమాచారం సీబీఐకి చెప్పాను : అజయ్ కల్లాం

వివేకా హత్యకేసులో మరో సంచలనం. మాజీ చీఫ్ సెక్రెటరీ అజయ్ కల్లాంను సీబీఐ ఎందుకు కలిసింది? ఆయన ఏం చెప్పారు? కల్లాం స్టేట్ మెంట్ కీలకం కానుందా? ఈ కేసులో అజయ్ కల్లాం స్టేట్ మెంట్ మరో కీలక మలుపు తిరగనుందా? అనేది ఆసక్తికరంగా మారింది.

YS Viveka Case..Ajeya Kallam : వివేకా కేసులో నాకు తెలిసిన సమాచారం సీబీఐకి చెప్పాను  : అజయ్ కల్లాం

YS Viveka Case..Ajeya Kallam

YS Viveka Case..Ajeya Kallam : వైఎస్ వివేకానందరెడ్డి కేసు విషయంలో సీబీఐ అధికారులు తనను కలిసారని..ఈకేసులో నాకు తెలిసిన సమాచారం సీబీఐకి ఇచ్చానని తెలిపారు మాజీ ఐఏఎస్ అధికారి,ఏపీ మాజీ చీఫ్ సెక్రెటరీ,సీఎం జగన్ ముఖ్య సలహాదారు అజయ్ కల్లాం. వివేకా గుండెపోటుతో చనిపోయారా? లేదా మరొకవిధంగా చనిపోయారా?అనే విషయాలు సీబీఐ అధికారులు తనను అడగలేదని కల్లాం వెల్లడించారు. ఈ కేసు విషయంలో నేను చెప్పిన విషయాలను కొంతమంది కావాలనే వక్రీకరించారని..కొంతమంది కావాలని తనమీద దుష్ర్పచారం చేస్తున్నారని అజయ్ కల్లాం ఆరోపించారు. దర్యాప్తు విషయాలు లీక్ కావటం సరికాదని అజయ్ కల్లాం అన్నారు.

కాగా వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తులో దూకుడు పెంచిన సీబీఐ కీలక విషయాలను రాబడుతోంది. ఈ కేసులో నిందితులుగా ఉన్నవారినే కాకుండా పలువురు అనుమానితులను విచారిస్తోంది. దీంట్లో భాగంగా మాజీ ఐఏఎస్ అధికారి,ఏపీ మాజీ చీఫ్ సెక్రెటరీ,సీఎం జగన్ ముఖ్య సలహాదారు అజయ్ కల్లాంను కూడా సీబీఐ అధికారులు కలిసారు. పలు ప్రశ్నలు వేశారు. అతని వాంగ్ములాన్ని రికార్డు చేసుకున్నారు. దీనికి అజయ్ కల్లాం ఏమన్నా సమాధానం చెప్పారో వెల్లడించారు.  కాగా..వివేకా హత్యకేసులో మరో సంచలనం నమోదుకానుందా? మాజీ చీఫ్ సెక్రెటరీ అజయ్ కల్లాం స్టేట్ మెంట్ కీలకం కానుందా? ఈ కేసులో అజయ్ కల్లాం స్టేట్ మెంట్ మరో కీలక మలుపు తిరగనుందా? అనేది ఆసక్తికరంగా మారింది.