Money Scam: కర్నూలు జిల్లాలో ప్రైవేటు కో-ఆపరేటివ్ సొసైటీ “ముద్ర” రూ.100 కోట్ల మోసం

ముద్ర అగ్రికల్చర్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ పేరుతో జనాల నుంచి డబ్బుపోగు చేసుకున్న ప్రైవేటు కో-ఆపరేటివ్ సొసైటీ సంస్థ అనంతరం బోర్డు తిప్పేసింది.

Money Scam: కర్నూలు జిల్లాలో ప్రైవేటు కో-ఆపరేటివ్ సొసైటీ “ముద్ర” రూ.100 కోట్ల మోసం

Mudra

Money Scam: ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకుని.. ఎక్కువ వడ్డీలు, లోన్లు ఆశచూపి వారి నుంచి కోట్ల రూపాయల డబ్బు వాసులు చేస్తున్నారు కొందరు అక్రమార్కులు. ప్రైవేటు కో-ఆపరేటివ్ సొసైటీ పేరుతో సంస్థను స్థాపించి ప్రజల నుంచి కోట్ల రూపాయలు కొల్లగొట్టి అనంతరం బోర్డు తిప్పేసిన ఘటన కర్నూలు జిల్లలో సోమవారం వెలుగులోకి వచ్చింది. కర్నూలు జిల్లా కోడుమూరులో “ముద్ర అగ్రికల్చర్ స్కిల్స్ డెవలప్మెంట్ మల్టీ స్టేట్స్ కో అపరేటివ్ సొసైటీ ప్రేవేట్ లిమిటెడ్” పేరుతో ఓ ప్రైవేటు కో-ఆపరేటివ్ సొసైటీ సంస్థ.. సూక్ష్మ రుణాల మాటున భారీ వసూళ్లకు పాల్పడింది.

Also read: Republic Day: గణతంత్ర దినోత్సవం వేళ బీహార్ లో హై అలెర్ట్

కోడుమూరులో రైతులు, చిరు వ్యాపారులు, సామాన్య ప్రజల నుంచి డైలీ కలెక్షన్ పేరుతో గత కొన్ని నెలలుగా కోట్ల రూపాయలు సేకరించింది. ముద్ర అగ్రికల్చర్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ పేరుతో జనాల నుంచి డబ్బుపోగు చేసుకున్న ప్రైవేటు కో-ఆపరేటివ్ సొసైటీ సంస్థ అనంతరం బోర్డు తిప్పేసింది. గత కొన్ని రోజులుగా కోడుమూరులోని “ముద్ర అగ్రికల్చర్ స్కిల్స్ డెవలప్మెంట్ మల్టీ స్టేట్స్ కో అపరేటివ్ సొసైటీ ప్రేవేట్ లిమిటెడ్” సంస్థ కార్యాలయం మూసివేయడంతో మోసపోయామని గ్రహించిన బాధితులు లబోదిబోమంటున్నారు. కష్టపడి సంపాదించుకుని, పైసా పైసా కూడబెట్టుకున్న డబ్బును కో అపరేటివ్ సొసైటీ యాజమాన్యం కాజేసి తమ నెత్తిపై కుచ్చుటోపీ పెట్టిందంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Also read: Viral Video: రెండు రైళ్ల మధ్య పరిగెత్తిన గుర్రం అందులో ఒక జీవిత సత్యం

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కర్నూలు జిల్లాలో కోట్ల రూపాయలు వసూలు చేసి ముద్ర యాజమాన్యం.. మొత్తం రాయలసీమ ప్రాంతంలో రూ.100 కోట్లకు పైగానే వసూలు చేసినట్లు సమాచారం. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ముద్ర సంస్థకు అనేక బ్రాంచీలు ఉన్నాయి. రెండు రాష్ట్రాల్లో అనేక జిల్లాల్లో బోర్డు తిప్పేసినట్లు వార్తలు వస్తుండడంతో లక్షల మంది బాధితులు సంస్థకు చెందిన ఆయా కార్యాలయాలకు చేరుకుంటున్నారు.

Also read: Corona Update: భారత్ లో 3,06,064 కొత్త కరోనా కేసులు నమోదు