Corona Update: భారత్ లో 3,06,064 కొత్త కరోనా కేసులు నమోదు

గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 2,43,495 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇప్పటి వరకు మహమ్మరి నుంచి కోలుకున్న వారి సంఖ్య 3,68,04,145కి చేరింది.

Corona Update: భారత్ లో 3,06,064 కొత్త కరోనా కేసులు నమోదు

India Covid Cases New Covid Cases And Deaths In National Wide

Updated On : January 24, 2022 / 9:22 AM IST

Corona Update: భారత్ లో కరోనా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. దేశంలో నిత్యం సరాసరి మూడు లక్షలకు పైగా కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. ఆదివారం ఉదయం 8 గంటల నుంచి సోమవారం ఉదయం 8 గంటల మధ్యలో దేశ వ్యాప్తంగా 3,06,064 కొత్త కరోనా కేసులు నమోదు అయ్యాయి. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కరోనా కేసుల సంఖ్య 22,49,335కి చేరింది. దీంతో రోజువారీ పాజిటివిటీ రేటు 20.75% శాతానికి చేరుకుంది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 2,43,495 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇప్పటి వరకు మహమ్మరి నుంచి కోలుకున్న వారి సంఖ్య 3,68,04,145కి చేరింది. గడిచిన 24 గంటల్లో మహమ్మారి భారిన పడి 439 మంది మృతి చెందారు.

Also read: Karnataka Farmer: రైతుని అవమానించిన కార్ షో రూమ్ సేల్స్ మ్యాన్, ఆతరువాత అద్దిరిపోయే సీన్

ఇక ఇప్పటి వరకు భారత్ లో కరోన నిర్ధారణ పరీక్షలు 71.69 కోట్లు దాటినట్లు ఐసీఎంఆర్ ప్రకటించింది. గడిచిన 24 గంటల్లో 14,74,753 మందికి కోవిడ్ టెస్టులు నిర్వహించారు. దేశ వ్యాప్తంగా దేశవ్యాప్తంగా 3170 లాబ్స్ లో కరోనా నిర్ధారణ పరీక్షలు జరుగుతున్నాయి. దేశంలో ప్రస్తుతం నమోదు అవుతున్న కరోనా కేసుల్లో అత్యధికంగా ఓమిక్రాన్ బాధితులు ఉన్నారు. ఇక సోమవారం ఉదయం 8 గంటల వరకు దేశ వ్యాప్తంగా 162.26 కోట్ల వాక్సిన్లు పంపిణీ చేసినట్లు కేంద్ర వైద్యారోగ్యశాఖ పేర్కొంది. దేశంలో రికవరీ రేటు 93.07% శాతానికి చేరుకోగా వారంవారీ పాజిటివిటీ రేట్ 17.03% శాతంగా నమోదు అయింది.

Also read: Viral News: అమ్మ ఫోన్ తో ఆడుకుంటూ రూ.1.50 లక్షల షాపింగ్ చేసిన బుడతడు