Viral Video: రెండు రైళ్ల మధ్య పరిగెత్తిన గుర్రం అందులో ఒక జీవిత సత్యం

వేర్వేరు పట్టాలపై రెండు ఎదురెదురుగా వచ్చిన రైళ్ల మధ్యలో చిక్కుకున్న ఒక గుర్రం..ప్రమాదం నుంచి ఎలా బయటపడిందో ఈ వీడియో చూస్తే తెలుస్తుంది.

Viral Video: రెండు రైళ్ల మధ్య పరిగెత్తిన గుర్రం అందులో ఒక జీవిత సత్యం

Horse

Updated On : January 24, 2022 / 10:05 AM IST

Viral Video: రెండు ఎదురెదురుగా వచ్చిన రైళ్ల మధ్యలో చిక్కుకున్న ఒక గుర్రం..ప్రమాదం నుంచి ఎలా బయటపడిందో ఈ వీడియో చూస్తే తెలుస్తుంది. కానీ అందులో ఒక జీవిత సత్యం దాగి ఉందని గ్రహించండి అంటూ ఐపీఎస్ అధికారి దీపాంషు కబ్రా తన ట్విట్టర్ ఖాతాలో ఆ వీడియోను పోస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే ఈజిప్టులోని రెండు రైలు పట్టాల మధ్య గుర్రం మేతమేస్తుంది. అదే సమయంలో రెండు రైళ్లు వేర్వేరు పట్టాలపై ఎదురెదురుగా వచ్చాయి. రైళ్ల శబ్దాలకు బెదిరిపోయిన ఆ గుర్రం రెండు రైళ్ల మధ్య..పరిగెత్తింది. మెరుపు వేగంతో గుర్రం పరిగెడుతుంటే.. ట్రైన్ లో ఉన్న ప్రయాణికులు దాని క్షేమం కోసం ప్రార్ధించారు.

Also read: Corona Update: భారత్ లో 3,06,064 కొత్త కరోనా కేసులు నమోదు

ఇక ఈ దృశ్యాన్ని ప్రయాణికుడొకరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ సంఘటన జరిగిన సమయం తెలియ రాలేదుగానీ.. వీడియో మాత్రం ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ వీడియోను భారత ఐపీఎస్ అధికారి దీపాంషు కబ్రా ట్విట్టర్ లో షేర్ చేయగా దాదాపు 34 లక్షల మంది వీక్షించారు. ప్రమాదంలో చిక్కుకున్న గుర్రం ఎంతో చాకచక్యంగా వ్యవహరించి ప్రాణాలు దక్కించుకుందని.. జీవితంలో ఎదురయ్యే చిన్న చిన్న కష్టాలను తట్టుకుంటూ మనపై మనం నమ్మకం ఉంచుకుని ముందుకు సాగాలంటూ దీపాంషు కబ్రా రాసుకొచ్చారు.

Also read: Karnataka Farmer: రైతుని అవమానించిన కార్ షో రూమ్ సేల్స్ మ్యాన్, ఆతరువాత అద్దిరిపోయే సీన్