Auto Catches Fire : చేతికందే ఎత్తులో కరెంట్ వైర్లు, ఆటోపై ఇనుప మంచం.. చిల్లకొండయ్యపల్లి ఆటో ప్రమాదానికి కారణాలివే

ఒకరిది చిన్నపాటి నిర్లక్ష్యం..మరొకరిది పెద్ద తప్పు.. రెండూ కలిసి ఐదుగురిని మింగేశాయి. రెక్కాడితే కానీ డొక్కాడని కూలీలను బలితీసుకున్నాయి. శ్రీసత్యసాయి జిల్లాలో ఆటోపై హైటెన్షన్ విద్యుత్ తీగలు తెగి పడటంతో ఐదుగురి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి.

Auto Catches Fire : చేతికందే ఎత్తులో కరెంట్ వైర్లు, ఆటోపై ఇనుప మంచం.. చిల్లకొండయ్యపల్లి ఆటో ప్రమాదానికి కారణాలివే

Auto Catches Fire

Auto Catches Fire : ఒకరిది చిన్నపాటి నిర్లక్ష్యం..మరొకరిది పెద్ద తప్పు.. రెండూ కలిసి ఐదుగురిని మింగేశాయి. రెక్కాడితే కానీ డొక్కాడని కూలీలను బలితీసుకున్నాయి. శ్రీసత్యసాయి జిల్లాలో ఆటోపై హైటెన్షన్ విద్యుత్ తీగలు తెగి పడటంతో ఐదుగురి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. వ్యవసాయ పనుల కోసం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆటో పూర్తిగా కాలి బూడిదైంది. ప్రమాదానికి గురైన ఆటోలో 11మందిని ఎక్కించారు. పొలం పనులకు వెళ్లుండగా రకరకాల పనిమూట్లతో ఆటోను నింపేశారు. ఆటోలో విపరీతంగా లోడ్ వేశారు. అది చాలదన్నట్టు ఆటో టాప్ మీద ఓ ఇనుప మంచం కట్టి తీసుకెళ్తున్నారు. అదే తమ పాలిట మృత్యుపాశం అవుతుందని ఊహించలేకపోయారు.

Auto Catches Fire In AP : ఆటో ప్రమాదం పాపం ‘ఉడుత’దే..మా తప్పేమీ లేదు : ఏపీ ఎస్పీడీసీఎల్‌ సీఎండీ

కూలీలతో వెళ్తున్న ఆటో చిల్లకొండయ్యపల్లి దగ్గరికి రాగానే హైటెన్షన్ విద్యుత్ వైర్ తెగిపడింది. ఆటోపై ఇనుప మంచం ఉండటంతో షార్ట్ సర్క్యూట్ తో మంటలు చెలరేగాయి. పవర్ ఫుల్ విద్యుత్ తీగ కావడంతో క్షణాల్లోనే మంటలు వ్యాపించాయి. దీంతో ఐదుగురు మహిళా కూలీలు సజీవదహనం అయ్యారు. అందరూ చూస్తూ ఉండగానే మంటల్లో కాలిపోయి ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదానికి ఆటోపై ఉన్న ఇనుప మంచమే కారణం అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆటోడ్రైవర్ నిర్లక్ష్యమే ఐదుగురి ప్రాణాలు తీసిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

Auto Catches Fire: ఆటోపై విద్యుత్ తీగలు పడి.. ఐదుగురు సజీవ దహనం

మరోవైపు ఆటో ప్రమాదంలో విద్యుత్ శాఖ అధికారుల వాదనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విద్యుత్ స్తంభంపై ఉన్న ఉడతే ప్రమాదానికి కారణం అని ఏపీ ఎస్పీడీసీఎల్ సీఎండీ హరినాథరావు చెప్పుకొచ్చారు. ఉడత హైటెన్షన్ విద్యుత్ వైర్లను కొరకడంతో అవి తెగిపోయి ఆటోపై పడ్డాయని హరినాథరావు విశ్లేషించారు. ఆయన వాదనపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. హైటెన్షన్ విద్యుత్ వైర్లు ఉడత కొరికితే తెగిపోయే అంత బలహీనంగా ఉన్నాయా అని జనం ప్రశ్నిస్తున్నారు.

N.Chandrababu Naidu: ఆటో ప్రమాదంపై చంద్రబాబు దిగ్భ్రాంతి.. విద్యుత్ శాఖ నిర్లక్ష్యం వల్లే ప్రమాదమన్న లోకేష్

వాస్తవానికి ప్రమాదం జరిగిన ప్రాంతంలో విద్యుత్ వైర్లు కిందకు వేలాడుతున్నాయి. చెయ్యి ఎత్తితే అందేంత కిందకు ఉన్నాయి. వాటిలో అధిక ఓల్టేజీలో విద్యుత్ ప్రవహిస్తూ ఉంటుంది. ఆ వైర్లను ఎవరైనా తాకితే పెను ప్రమాదం జరిగే అవకాశం ఉంది.

CM JAGAN: ఆటో ప్రమాద ఘటనపై సీఎం జగన్ దిగ్భ్రాంతి.. పది లక్షల పరిహారం ప్రకటన

ఈ విషయం విద్యుత్ శాఖ అధికారులకు తెలిసే ఉండాలి. కానీ, వారు పట్టించుకున్న పాపాన పోలేదు. వాటిని రిపేర్ చేయాలనే ఆలోచన చేయలేదు. ఇప్పుడు ఆ వైర్లే ఆటోకి తగిలి ఐదుగురి ప్రాణాలు పోయాయి. ఈ వ్యవహారంలో విద్యుత్ అధికారులు తమ తప్పు లేదన్నట్టుగా ప్రవర్తిస్తున్నారని జనం మండిపడుతున్నారు. ఉడత పేరు చెప్పి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఫైర్ అవుతున్నారు.

Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw