Jobs : అనంతపురం ప్రభుత్వవైద్య కళాశాలలో ఒప్పంద పోస్టుల భర్తీ
ఆయా పోస్టులకు సంబంధించి నెలకు వేతనంగా 12వేల రూపాయల నుండి 37,100 వరకు చెల్లిస్తారు.

Jobs
Jobs : ఏపిలోని అనంతపురం జిల్లా ప్రభుత్వ వైద్య కళాశాల లో ఒప్పంద ప్రాతిపదికన పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. ఆసక్తి గల అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 5ఖాళీలను భర్తీ చేయనున్నారు. భర్తీ చేయనున్న పోస్టులకు సంబంధించి ఫిజిసిస్ట్ 1, రేడియోగ్రాఫర్ 1, ల్యాబ్ టెక్నీషియన్ 1, వైర్ మెన్ అండ్ ఎలక్ట్రీషియన్ 1, ల్యాబ్ అటెండెంట్ 1 ఖాళీలు ఉన్నాయి.
ఆయా పోస్టులకు సంబంధించి నెలకు వేతనంగా 12వేల రూపాయల నుండి 37,100 వరకు చెల్లిస్తారు. పోస్టును బట్టీ 10 వ తరగతి, ఐటీఐ, డిప్లొమా , ఫిజిక్స్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. విద్యార్హతలతోపాటుగా పనిలో అనుభవం కలిగి ఉండాలి. రాతపరీక్ష, అనుభవం, రిజర్వేషన్ అధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
అభ్యర్ధులు తమ దరఖాస్తులను అఫ్ లైన్ ద్వారా పంపాల్సి ఉంటుంది. దరఖాస్తులకు చివరి తేది ఫిబ్రవరి 25, 2022గా నిర్ణయించారు. దరఖాస్తులు పంపాల్సిన చిరునామా ప్రిన్సిపాల్, ప్రభుత్వ వైద్య కళాశాల, అనంతపురం, ఆంధ్రప్రదేశ్.