AP TDP: మహిళా సాధికారత సాధించటమంటే.. రోజా డ్యాన్స్‌లు వేసినంత తేలిక కాదు

మహిళా సాధికారత సాధించటమంటే.. రోజా డ్యాన్స్‌లు వేసినంత తేలిక కాదంటూ తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు అనిత తీవ్రస్థాయిలో విమర్శించారు. వైకాపా పాలనలో

AP TDP: మహిళా సాధికారత సాధించటమంటే.. రోజా డ్యాన్స్‌లు వేసినంత తేలిక కాదు

Tdp Ledar Anitha

AP TDP: మహిళా సాధికారత సాధించటమంటే.. రోజా డ్యాన్స్‌లు వేసినంత తేలిక కాదంటూ తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు అనిత తీవ్రస్థాయిలో విమర్శించారు. వైసీపీ పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బంధిపోట్లు ఊళ్ళోకి వస్తుంటే దుకాణాలు మూసేసి, ఇళ్లలో దాక్కునే ఘటనలు సినిమాల్లో చూసేవాళ్ళమని, ఇప్పుడు జగన్ ఇంట్లో నుంచి బయటకు వస్తుంటే అదే పరిస్థితి కనిపిస్తోందని విమర్శించారు. 2వేల మంది పోలీసులు పహారాలో రోడ్లపై పరదాలు, ముళ్ళకంచెలు కడితే తాడేపల్లి ప్యాలెస్ నుంచి జగన్ బయటకు వస్తున్నారని అన్నారు. పులివెందుల పులి కాస్తా తాడేపల్లి పిల్లిలా మారిపోయాడని, నారా లోకేష్ అలా కాకుండా కాళ్లకు బలపాలు కట్టుకుని ప్రజల మధ్య తిరుగుతున్నాడని అనిత పేర్కొన్నారు. చీర ఎవరు కట్టుకోవాలో, ఎవరికి పంపిస్తుందో రోజానే తేల్చుకోవాలని ఇటీవల రోజా చేసిన వ్యాఖ్యలకు అనిత కౌంటర్ ఇచ్చారు.

Minister Roja : మహిళల రక్షణ కోసం చంద్రబాబు ఒక్క పథకమైనా తీసుకొచ్చారా? : మంత్రి రోజా

రాష్ట్రంలో 800మందికి పైగా మహిళలపై అఘాయిత్యాలు జరిగితే.. కనీసం నోరెత్తని సీఎంకు ఏం చీర పంపిస్తావా అంటూ రోజాను ప్రశ్నించారు. తన నియోజకవర్గంలో నాగమ్మ అనే మహిళను హత్య చేస్తే నోరు మెదపని సీఎం ఒక సీఎంనేనా అంటూ ప్రశ్నించారు. లోకేష్ ఓటమి గురించి మాట్లాడుతున్న రోజా.. తాను ఓడిపోయిన సంగతి మరిచిందా అంటూ ప్రశ్నించారు. విశాఖలో విజయమ్మను జగన్ ఓడించారా లేక ఆమె ఓడిపోయారా అంటూ ప్రశ్నిస్తూనే.. వీటన్నింటికీ ఎన్ని చీరలు కావాలో చెప్తే పంపిస్తానంటూ రోజా వ్యాఖ్యలకు అనిత కౌంటర్ ఇచ్చారు.

Minister Roja On Jagan : జగన్‌ను మళ్లీ ముఖ్యమంత్రిని చేయడమే లక్ష్యం- మంత్రి రోజా

ఆడపిల్లల్ని రక్షించలేని జగన్ గురించి ఇలానే మాట్లాడాలని, మహిళా సాధికారత సాధించటమంటే రోజా డ్యాన్స్‌లు వేసినంత తేలిక కాదంటూ అనిత తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. వైసీపీ నేతల ఫ్రస్ట్రేషన్ పీక్స్ లో ఉందని ఎద్దేవా చేశారు. మహిళలపై అఘాయిత్యాలకు సంబంధించి 800కేసుల్లో వాసిరెడ్డి పద్మ చేతకానితనం బయటపడిందని అన్నారు. అసభ్య పదజాలం వాడకూడదని, సభ్యత సంస్కారం ఉండాలంటూ వైసీపీ నేతలు ప్రవచనాలు చెప్పటం విడ్డురంగా ఉందంటూ అనిత వ్యాఖ్యానించారు.