Minister Roja : మహిళల రక్షణ కోసం చంద్రబాబు ఒక్క పథకమైనా తీసుకొచ్చారా? : మంత్రి రోజా

జగన్ మహిళల రక్షణ కోసం దిశ యాప్ తీసుకొచ్చారని తెలిపారు. మహిళా రక్షణకు ప్రభుత్వం తీసుకుంటున్న పార్లమెంట్ కీర్తించిందని వెల్లడించారు. మహిళా రక్షణ కోసం చంద్రబాబు ఒక్క చర్య కూడా తీసుకోలేదని విమర్శించారు.

Minister Roja : మహిళల రక్షణ కోసం చంద్రబాబు ఒక్క పథకమైనా తీసుకొచ్చారా? : మంత్రి రోజా

Roja (1)

AP Minister Roja : జగన్ పాలనలో మహిళలంతా సుఖంగా సంతోషంగా ఉన్నారని పేర్కొన్నారు. మహిళల జీవితాల్లో జగన్ వెలుగులు నింపారని కొనియాడారు. మహిళలకు 50 శాతం రిజ్వేషన్లు ఇచ్చి ఆర్థికంగా రాజకీయంగా ఎదిగేలా చేశారని తెలిపారు. సంక్షేమ పథకాల్లో 75 శాతం మహిళలకే ఇచ్చారని తెలిపారు. మహిళలు రాజకీయంగా, ఆర్థికంగా ఎదిగేందుకు జగన్ అండగా ఉన్నారని పేర్కొన్నారు. ఇలాంటివి చూసి సహించలేక చంద్రబాబు అండ్ కో ప్రస్టేషన్ తో రగిలిపోతున్నారని చెప్పారు. బాధితురాలికి అండగా ఉండకుండా రాజకీయాలకు వాడుకుంటున్నారని విమర్శించారు. ఇలా చేసే వాళ్ళని శిక్షించడానికి కొత్త చట్టం తీసుకురావాలన్నారు. మహిళా కమీషన్ చైర్ పర్సన్ పైనే దాడికి ప్రయత్నించారని ఆరోపించారు.

జగన్ మహిళల రక్షణ కోసం దిశ యాప్ తీసుకొచ్చారని తెలిపారు. మహిళా రక్షణకు ప్రభుత్వం తీసుకుంటున్న పార్లమెంట్ కీర్తించిందని వెల్లడించారు. మహిళా రక్షణ కోసం చంద్రబాబు ఒక్క చర్య కూడా తీసుకోలేదని విమర్శించారు. మహిళల సంక్షేమ కోసం చంద్రబాబు ఒక్క పథకమైనా తీసుకొచ్చారా అని ప్రశ్నించారు. టీడీపీ, చంద్రబాబు మహిళా ద్రోహి.. టీడీపీలో ఉన్న ఉన్మాదుల కంటే ఎవరూ ఎక్కువ కాదన్నారు. అందరికంటే పెద్ద ఉన్మాది చంద్రబాబు.. మహిళా నేతలతో జగన్ ను భూతులు తిట్టిస్తున్నారని ఆరోపించారు. జగన్, భారతి లను గురించి తప్పుగా మాట్లాడితే సహించేది లేదని, చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

MLA Roja : చంద్రబాబు దొంగ ఏడుపులను ప్రజలు నమ్మరు : ఎమ్మెల్యే రోజా

దొంగలా కరకట్టపై దాకున్న చంద్రబాబు చీర కట్టుకోవాలని ఎద్దేవా చేశారు. సొంతగా పార్టీ పెట్టుకోకుండా ఎన్టీఆర్ పార్టీని లాకున్న చంద్రబాబు చీర కట్టుకోవాలని సూచించారు. సొంత కొడుకుని ఎమ్మేల్యేగా గెలిపించుకోలేకపోయినందుకు తండ్రీకొడుకులు పచ్చ చీరలు కట్టుకోవాలని అన్నారు. చీరలు కావాలో.. చుడీదార్ లు కావాలో తేల్చుకోండి అని పేర్కొన్నారు. జగన్ ను విమర్శించే హక్కు చంద్రబాబుకు లేదని స్పష్టం చేశారు.

మహిళా రక్షణ గురించి మాట్లాడే అర్హత టీడీపీకి లేదన్నారు. దమ్మున్న నాయకుడు సీఎం జగన్ అన్నారు. జగన్ దమ్మెంటో 12 ఏళ్లుగా చూస్తున్నారు కదా.. కొత్తగా చూడాలా అని అన్నారు. ఒక్క ఎమ్మేల్యే నుండి 151 ఎమ్మెల్యే వరకూ ఎలా దమ్ముగా ఏదిగారో చూడలేదా అని ప్రశ్నించారు. టీడీపీని 23 సీట్లకు పరిమితం చేసినప్పుడు తెలియలేదా అని తెలిపారు. చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం కూడా వేస్ట్ అని ఎద్దేవా చేశారు. సొంతంగా ఎన్నికలకు వెళ్లే దమ్ము చంద్రబాబకు ఉందా అని ప్రశ్నించారు.