Vijayawada : విజయవాడ శివారులో రౌడీ షీటర్ దారుణ హత్య
విజయవాడ శివారు గన్నవరం పోలీసు స్టేషన్ పరిధిలో రౌడీషీటర్ దారుణ హత్యకు గురయ్యాడు.

Vijayawada Rowdy Sheeter Murder
Vijayawada : విజయవాడ శివారు గన్నవరం పోలీసు స్టేషన్ పరిధిలో రౌడీషీటర్ దారుణ హత్యకు గురయ్యాడు. గన్నవరం మండలం ముస్తాబాద నుంచి విజయవాడ వెళ్లే దారిలో ఫ్లై ఓవర్ బ్రిడ్జి సమీపంలోని పంటపోలాల్లో రౌడీషీటర్ అనుమానస్పద రీతిలో మృతి చెందాడు.
మృతుడిని విజయవాడ అజిత్‌సింగ్ నగర్ ప్రాంతానికి చెందిన రౌడీషీటర్ అద్దంకి మోహన్ కుమార్(చిన్న)గా గుర్తించారు. ఉడ్ పాలిష్ వర్క్ పని చేస్తూ జీవనం సాగించే మోహన్ కుమార్ కు బ్లేడ్ బ్యాచ్ సభ్యులతోనూ సంబంధాలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
Also Read : Medchal: జొన్న రొట్టెలు చేస్తున్న మహిళను పొడిచి చంపిన దుండగుడు
బ్లేడ్ బ్యాచ్ సభ్యులే హత్య చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఘటనా స్ధలానికి చేరుకున్న గన్నవరం సీఐ శివాజీ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.