Vande Bharat Express Fares : రేపే.. తెలుగు రాష్ట్రాల మధ్య వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రారంభం.. టికెట్ ఛార్జీలు ఇవే
ఆన్ లైన్ లో వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. తెలుగు రాష్ట్రాల మధ్య వందే భారత్ రైలు సేవలు ప్రారంభం కానున్నాయి. సోమవారం నుంచి సికింద్రాబాద్-విశాఖ మధ్య రెగులర్ సర్వీసులు ఉంటాయి. ఆదివారం తప్ప ప్రతి రోజూ వందే భారత్ రైలు నడుస్తుంది.

Vande Bharat Express Fares : ఆన్ లైన్ లో వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. రేపు తెలుగు రాష్ట్రాల మధ్య వందే భారత్ రైలు సేవలు ప్రారంభం కానున్నాయి. ప్రధాని మోదీ వర్చువల్ గా ప్రారంభించనున్నారు. దీంతో సికింద్రాబాద్ విశాఖ మధ్య సేవలు అందుబాటులోకి వస్తాయి.
సోమవారం నుంచి సికింద్రాబాద్-విశాఖ మధ్య రెగులర్ సర్వీసులు ఉంటాయి. ఆదివారం తప్ప ప్రతి రోజూ వందే భారత్ రైలు నడుస్తుంది. ఏసీ చైర్ కార్, ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ సీట్లు అందుబాటులో ఉంటాయి. సికింద్రాబాద్ నుంచి విశాఖ ఏసీ చైర్ కార్ 751 సీట్లు, ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ లో 57 సీట్లు
ఉన్నాయి.
విశాఖ నుంచి సికింద్రాబాద్ ఏసీ చైర్ కార్ 627 సీట్లు, ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ 57 సీట్లు బుక్ చేసుకోవచ్చు. సికింద్రాబాద్ నుంచి విశాఖ ఏసీ చైర్ కార్ ధర రూ.1665, ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ ధర రూ.3,120గా ఉంది.
Also Read..Vande Bharat Express: మోదీ ప్రారంభించిన వందేభారత్-3 రైలు విశేషాలు ఏంటో తెలుసా?
విశాఖ నుంచి వచ్చేటప్పుడు రేట్లు మారతాయి. విశాఖ నుంచి సికింద్రాబాద్ ఏసీ చైర్ కార్ టికెట్ రేటు రూ.1720గా ఉంది. ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ ధర రూ.3వేల 170. సికింద్రాబాద్ నుంచి విజయవాడ ఏసీ చైర్ కార్ ధర రూ.905, ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ టికెట్ రేటు రూ.1,775. అలాగే విజయవాడ నుంచి సికింద్రాబాద్ ఏసీ చైర్ కార్ ధర రూ.1,060. ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ ధర రూ.1,915.
10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.
ఈ రైల్లో 16 కోచ్ లు ఉన్నాయి. 1,128 సీట్లు ఉన్నాయి. ఈ రైలు గంటకు 180 కిలోమీటర్ల వేగంతో సికింద్రాబాద్-విశాఖ మధ్య ఉన్న 699 కిలోమీటర్లను 8గంటల 40 నిమిషాల్లోనే డెస్టినేషన్ కు చేరుకుంటుందని రైల్వేశాఖ ప్రాథమికంగా అంచనా వేసింది. (నిజానికి సికింద్రాబాద్ నుంచి వైజాగ్ చేరుకోవాలంటే 12 నుంచి 14 గంటల సమయం పడుతుంది.) ఈ ట్రైన్ ఉదయం 5గంటల 45 నిమిషాలకు బయలుదేరి సికింద్రాబాద్ కు మధ్యాహ్నం 2 గంటల 20 నిమిషాలకు చేరుతుంది. అలాగే సికింద్రాబాద్ లో 2గంటల 45 నిమిషాలకు బయలుదేరి విశాఖకు రాత్రి 11గంటల 25 నిమిషాలకు చేరుకుంటుంది. వందేభారత్ ఎక్స్ ప్రెస్ లో ఆటోమేటిక్ డోర్ సిస్టమ్, ఉచిత వైఫై సౌకర్యం అందుబాటులో ఉంది.
వందే భారత్ ప్రత్యేకతలు..
* అల్ట్రా మోడల్ కోచ్ లు.
* ఎగ్జిక్యూటివ్ క్లాస్.
* పూర్తి స్థాయి సిట్టింగ్ తో పాటు ఏసీ సదుపాయం.
* పూర్తిగా దేశీయంగా తయారు.
* చాలా ఫాస్ట్ మూవింగ్.
* సికింద్రాబాద్-విశాఖ మధ్య దూరం బాగా తగ్గిపోతుంది.
* కేవలం 8.40 గంటల్లోనే సికింద్రాబాద్ నుంచి వైజాగ్ చేరుకోవచ్చు.