Andhra Pradesh : వైసీపీలో కొనసాగుతున్న బుజ్జగింపుల పర్వం

ఆంధ్రప్రదేశ్ లో మంత్రి పదవులు దక్కని అసంతృప్త ఎమ్మెల్యేలు అలిగిన సంగతి తెలిసిందే.  వారిని బుజ్జిగించే పనిని సీఎం జగన్మోహన్ రెడ్డి పలువురు నేతలకు అప్పచెప్పారు.

Andhra Pradesh : వైసీపీలో కొనసాగుతున్న బుజ్జగింపుల పర్వం

Ysrcp Disgruntled Mla's

Updated On : April 12, 2022 / 2:07 PM IST

Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్ లో మంత్రి పదవులు దక్కని అసంతృప్త ఎమ్మెల్యేలు అలిగిన సంగతి తెలిసిందే.  వారిని బుజ్జిగించే పనిని సీఎం జగన్మోహన్ రెడ్డి పలువురు నేతలకు అప్పచెప్పారు.

తీవ్ర అసంతృప్తితో ఉన్న మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభానులను సీనియర్లు బుజ్జగిస్తున్నారు. పిన్నెల్లితో మాట్లాడాలని సీఎం జగన్ సీనియర్ మంత్రి, పెద్దాయన, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఆదేశించారు.  పార్టీ నాయకులు పిన్నెల్లికి సమాచారం ఇవ్వటంతో ఆయన  సచివాలయంలో  మంత్రి పెద్దిరెడ్డితో భేటీ అయ్యారు. పిన్నెల్లికి మంత్రిపదవి రాకపోవటానికి గల కారణాలను మంత్రి పెద్దిరెడ్డి వివరిస్తున్నారు.

మరో వైపు మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్న జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభానుతో ఇప్పటికే మోపిదేవి వెంకట రమణ భేటీ అయ్యి ఆయనకు మంత్రి పదవి రాకపోవటానికి గల ఈక్వేషన్స్ వివరించారు. అయితే ఈ విషయం నేరుగా సీఎం చెప్తే సంతృప్తిగా ఉంటానని సామినేని చెప్పటంతో ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు ఆయన సీఎంను కలవనున్నారు.
Also Read : Anil Kumar Yadav: సీఎం జగన్‌కు సైనికుడుగా పని చేస్తా
ఇక మరో మాజీ మంత్రి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన మేకతోటి సుచరితతోనూ  పార్టీ ముఖ్య నేతలు చర్చిస్తున్నారు. ఆమె ఇప్పటికే సీఎం జగన్మోహన్ రెడ్డి అప్పాయింట్ మెంట్ కోరినట్లు తెలిసింది. ప్రకాశం జిల్లాలో బాలినేని శ్రీనివాస రెడ్డికి మంత్రి పదవి రాలేదని అలిగిన గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబుతో కూడా వైసీపీ నేతలు చర్చలు జరిపి ఆయన్ను బుజ్జగిస్తున్నారు.